శ్రీశైల దర్శనం
కాటి కాపరికి నీటి కొలనుతో పని ఏల?
భస్మాంగుడికి బంగారు కప్పులేల?
గంగాధరుడికి నిత్యాభిషేకాలేల?
సర్వాంతర్యామి దర్శనానికి వరుసలో ఎదురు చూడనేల?
వేర్వేరుగా ఉంటున్న అమ్మ వారిని, అయ్య వారిని
చూసి తరించానని అనుకోవడమెలా?
బిచ్చగాడిని అర్థించుటకు కుల సంఘాల పేరుతో కూడిన
ఈ కుళ్ళిన మాంసపు ముద్దలను భక్తులని అనుకోవడమేల? 
వారిని లెక్కించుటకు తోడుగా సాక్షి గణనాథుడేల?
నిగూఢ బహిరంగ రహస్యమగు నిరాకార రూపుడి లీలలను అవగతం చేసుకొన యత్నించనేల?
భావావేశంతో ఇలా నన్ను నేను హింసించుకోనేల?
వరాలుగా ప్రశ్నలను ఇవ్వడమేల శ్రీశైల మల్లేశ్వర?


- రాఘవేంద్ర ప్రసాద్ 
3

స్వర్గ సుందరి - శ్రీదేవి


దివి నుండి భువికి దిగిన అందం తనది 
సాటి లేని అభినయం తనది 

అప్పట్లో వయసొచ్చిన అమ్మాయి అచ్చం శ్రీదేవిలా ఉన్నావంటే ఎంతో మురిసిపోయేదో. ఏ ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకున్నా శ్రీదేవి గురించి తలచుకోకుండా ఉండేవాళ్ళు కాదు. అందానికే తానొక కొలమానం, తలమానికం.  

నాకు ఊహ తెలిసిన నాటి నుండి అందగత్తె అంటేనే శ్రీదేవి. తరవాతే ఎవరైనా. తెలుగు క్యాలెండరులు, పౌడర్ డబ్బాల మీద, న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డుల మీద, టపాసుల పెట్టెల మీద, మా ఊర్లో రిక్షా లు ఉండేవి, వాటి మీద శ్రీదేవి బొమ్మ సహజం. ఏ పెయింటర్ దేవత బొమ్మ కావాలంటే శ్రీదేవినే గీసేవాడు. ఎందుకంటే అంత కన్నా గొప్ప దేవత లేదని అందరికి తెలుసు. 

ఇలా ఎక్కడ చుసినా తన అందం చుట్టూ ఉండేది. చుట్టేస్తూ ఉండేది.. 

" ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ 
   పరవశాన పంచవమ్మా పాల సంద్రమా 
   అందమా అందుమా అందనంటే అందమా "

" పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు 
  రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో 
  అసలు భూలోకం చూసి ఉంటాడా 
 కనక ఈ చిత్రం స్వర్గానికి చింది ఉంటదా" 
" యమహో నీ యమా యమా  అందం 
  చెలరేగింది ఎగా దిగా తాపం "

" కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి 
  చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి "

ఇలా కవులెందరో తన అందానికి పరవశించారు, పోలిక పొగడ్తలతో ప్రవహించారు. 


ఇంత అందం ఉంది మరి నటనో అనుకుంటే, తన నటన చిన్న పిల్లాడికి సైతం తన అర్ధం అవుతుంది.
అంత గొప్ప సహజ నటి. ఆ నటనా శిఖరానికి ఈ కింద వీడియో చిన్న ఉదాహరణ. తన నటనకు భాష బేధం లేదు, ప్రాంతీయ భేదం లేదు.  అసలు పోలిక లేదు..  పోటీ లేదు.. పొగడ్తకు సరిపడా భాష లేదు.  మన ఇంట్లో మనిషిలా ఉంటుంది, మన మధ్యే ఉన్నట్టు ఉండేది. కానీ ఉన్నట్టు ఉండి మన మధ్య లేకుండా వెళ్ళింది. దేవుడు మంచి వాళ్ళని ఎత్తుకు పోతున్నాడు, పాపులను ఎం చేసుకోను అని అనుకుంటున్నాడేమో. లేక తనని తీసుకెళ్తా అంటే మనం ఊరుకోమని వాడికి తెలిసిపోయింది. అందుకే నిద్ర మాటున మోసం చేసాడేమో. ఎంతైనా తెలివైన వాడు. కన్నీళ్ళకి  తెలిసిపోయింది చివరి చూపుగా చూస్తా అంటూ బయటికి వచ్చేస్తున్నాయి. సాటిరాని అందానికి న్యాయం చేసింది,

పోటీలేని నటనకు న్యాయం చేసింది,

ఇద్దరి కూతుళ్లతో కుటుంబానికి న్యాయం చేసింది, 


ఇలా 54 కే తొందరపడి అన్యాయం చేసింది


ఎంత స్వర్గానికి చెందిన చిత్రమైతే మాత్రం ఇంత తొందరగానా వెళ్ళేది  ?? 
- మీ అభిమాని 
0

ఈ సినిమా చూసారా ? - Detectiveచాలా కాలం తర్వాత మంచి డిటెక్టివ్ థ్రిల్లర్ వచ్చింది, అసలు డిటెక్టివ్ మూవీస్ చూసి చాలా రోజులైంది కదా ! అందులో ఈరోజుల్లో మంచిది అంటే కష్టమే (3 ఫైట్లు 6  కమర్షియల్ సినిమా కాకుండా  అని నా ఉద్దేశం!)

ఈ సినిమా గురించి చెప్పాలంటే అన్ని కొత్త విషయాలే .. ఒక నవల చదివినప్పుడు కలిగే థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ ఒక  పెట్టడం అంటే మాములు గొప్ప విషయం కాదు. డిటెక్టివ్ సినిమా అంటే మనం కూడా బుర్ర పెట్టి ఆలోచించాలి అన్న ఆలోచన రావొచ్చు .. కానీ ఈ సినిమాకు కష్ట పడాల్సిన పనిలేకుండా డైరెక్టర్ చాలా బాగా screenplay రాసుకున్నారు. ప్రతి చిన్న విషయం ప్రశ్నలా మిగిలిపోకుండా దాని వెంటనే ఒక చిన్న సన్నివేశంతో సమాధాన పరుస్తూ కధలో అంతర్లీనంగా వెళ్తూ ఉంటుంది.. ఇది ఒక కొత్త విషయమే మరి. ఇలాంటివి బోలెడు 


కథ: కథ విషయానికి వస్తే.. చిన్న తీగ లాగితే డొంకంతా కదిలింది అన్న అంశాన్ని అద్భుతంగా చూపించారు. (కథ ఇక్కడితో ఆపేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా )విశాల్: డిటెక్టివ్ అంటే కాన్ఫిడెంట్ ముఖ్యం . దానికి తగ్గట్టుగా సూపర్ కాన్ఫిడెంట్ పాత్రలో ఒదిగిపోయాడు. తనతో పాటు మనల్ని డిటెక్టివ్ మూడ్ లోకి తీసుకువెళ్తాడు. తను చేసే పనులకి అర్ధం చూపిస్తూ అంతే ఇంటెలిజెంట్ గా మనలని ఆలోచింపచేస్తాడు. సినిమా మొత్తం తనే డ్రైవ్ చేస్తూ అద్భుతంగా నటించాడు . ముఖ్యంగా kungfu ఫైట్ ఒక సర్ప్రైజ్
వినయ్ : డిటెక్టివ్ సినిమా అంటే ప్రతి చిన్న విషయం గమనించాలి.. అలా గమనింపదగిన  విషయాలన్నీ తుడిచేస్తూ .. వాటి ఆనవాళ్ళని మార్చేస్తూ తన మేధా శక్తికి సవాళ్ళను విసిరేవాడే విలన్. ఇంటెలిజెంట్ గా ఉంటూ, అంతే రీతిలో ఎంతో క్రూరంగా తన పనులను చేసుకుంటూ పోతాడు విలన్. వినయ్ దీనికి తగ్గట్టుగా పాత్రకి సరైన న్యాయం చేసాడు. 


భాగ్యారాజ్: నటుడు భాగ్యరాజ్ ఈ సినిమాలో ఒక surprise ఎలిమెంట్. బాగా చేసాడు, ఒదిగాడు అని చెప్పడం కంటే చూస్తేనే బెటర్ 

ప్రసన్న, ఆండ్రియా, అను ఎమాన్యూల్ : కథలో జరిగే పాత్రల్లో ఒదిగి పోయారు.


ఫోటోగ్రఫీ : మాములు విషయాన్ని కొత్తగా డిటెక్టివ్ మోడ్ లోకి తీసుకెళ్తుంది, కెమెరాకి లెన్స్ మార్చినట్టు మన కళ్ళకి కొత్త లెన్స్ పెట్టేసినట్టు ఉంటుంది కెమరామెన్  కార్తీక్ వెంకటరామన్ పనితనం. నిజంగానే ఫ్రేమ్స్ చూడగానే నచ్చేస్తాయి , దానికి చిన్న ఉదాహారణ ట్రైలర్లో వచ్చిన ఈ క్రింది షాట్స్. 

సంగీతం: పాటల్లేని సినిమాకి background ప్రాణం, ఇది ఇంకా బాగుంటే బాగుండేది అనిపించింది కానీ Arrol Corelli పనితనం పరవాలేదు.

డైరెక్షన్ : ఈ డిపార్ట్మెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఒక్క పాట లేకుండా ప్రేక్షకుడిని కట్టిపడేయడమే కాకుండా.. రెప్ప ఆర్పితే ఎం జరుగుతుందో ఏం మిస్ అవుతామన్న ఆలోచన కలిగించేలా ఉంటుంది డైరెక్టర్ టాలెంట్. Mysskin deserves true appreciations. డేవిడ్ ఫించేర్ రేంజ్ లో exciting ఎలెమెంట్స్ ఉన్నాయనడంలో సందేహాలు లేవు. 


చూసినప్పుడు చాలా ఉన్నాయి.. కానీ కొన్ని విషయాలు మాత్రమే చెప్పగలను, డబ్బింగ్ సినిమా కదా ఏముంటుంది అరవ గోల తప్ప అని అనుకోవద్దు, ఇది ఏ ప్రాంతానికి చెందదు.  
Truly International Content , just go and watch !! - సినీ ప్రేమికుడు 0

ప్రేమ - గెలుపు - ఐశ్వర్యంఒక పల్లెలోని ఒక ఇంటికి అపరాహ్న వేళ, అలసిపోయిన ముగ్గురు పెద్దమనుషులు వచ్చారు. అప్పుడే పొలం నుండి వచ్చిన భర్తకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, వీధి తలుపు మూద్దామని బయటికి వచ్చిన ఆ ఇంటి ఇల్లాలికి వసారాలో అరుగు మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న ఆ ముగ్గురు కనిపించారు. 

వాళ్ళు బహుశా తన భర్తతో పాటు వచ్చిన వాళ్ళేమో ననుకొని, భోజనం సమయానికి వచ్చారని, చాలా మర్యాదగా "లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి భోజనం చేద్దురు కానీ..." అన్నది.

వాళ్ళు ఆమెవంక సాదరంగా చూస్తూ, "మాకొక నియమం వున్నది. మా ముగ్గురిలో ఒకడు మత్రమే మీ ఇంట్లోకి వస్తాడు. నా పేరు 'ప్రేమా, ఇతని పేరు 'గెలుపూ, ఇతని పేరు 'ఐశ్వర్యం'.


 మీ ఇష్టం వచ్చిన వారిని ఆహ్వానించండి." అన్నాడు. ఆ ఇల్లాలు మొదట ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకొని, ఆ వచ్చిన వారు మాములు మనుషులు కారని ప్రేమ, గెలుపు, ఐశ్వర్యం అనే రూపాల్లో ఉన్న మహానుభావులని అనుకొన్నది.ఆమె సంతోషంతో పొంగిపోతు ఇంట్లోకి వెళ్లి, ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. 

అది వినగానే ఆమె భర్త పరమానందంతో "జీవితంలో మనిషికి గెలుపే ముఖ్యం.. కాబట్టి గెలుపునే పిలుద్దాం" అన్నాడు.

దానికి ఆమె "గెలుపు ఒకటే ఏమి లాభం, ఐశ్వర్యం లేకపోయేక... కాబట్టి ఐశ్వర్యాన్ని ఆహ్వనిద్దాం" అన్నది.
వీరిద్దరి మాటలు వింటున్న వారి కోడలు, " గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ గొప్పది. 


ఒక కుటుంబంలోని భార్యా, భర్తా, పిల్లలు, అత్తా, కోడళ్ళు అందరూ కలిసి మెలసి ఎటువంటి అరమరికలు లేకుండా ఉండగలగడానికి ప్రేమ మాత్రమే మూలాధారం మనిషి సుఖజీవనానికి ఆలంబన ప్రేమ మాత్రమే! కాబట్టి ప్రేమను ఆహ్వానించండి" అంటూ సలహ ఇచ్చింది.

వెంటనే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి మీలో ' ప్రేమ ' అనే వ్యక్తి లోపలికి రావచ్చు అన్నాడు. ప్రేమ అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. ప్రేమ వెనకే గెలుపు, ఐశ్వర్యం కూడా అతనితో బాటు ఇంట్లోకి వచ్చారు. ఇది చూసి అందరికీ అమితమైన ఆశ్చర్యం కలిగింది.


వారి ఆశ్చర్యానికి సమాధానంగా ప్రేమ అనే వ్యక్తి ఇలా చెప్పాడు. "మీరు, గెలుపును కానీ, ఐశ్వర్యం కాని కోరుకొని వుంటే, ఆ ఒక్కడు మాత్రమే లోపలి వచ్చేవాడు. మిగతా ఇద్దరం బయటే ఉండిపోయే వాళ్ళం. అలా కాకుండా మీరు ప్రేమను ఆహ్వానించారు. ఏ కుటుంబంలో అయితే ప్రేమ ఉంటుందో అక్కడ, గెలుపు, ఐశ్వర్యం అంటిపెట్టుకొని వుంటాయి." అన్నాడు.


కోడలు సలహా పాటించి నందుకు తమకు మంచే జరిగిందని సంతోషించి, వాళ్ళు ఆ ముగ్గురికి, ఎంతో ప్రేమతో అతిథిమర్యాదలు చేశారు. ఆ రోజు నుండి ఆ ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి. మనుషుల మధ్య అరమరకలు తొలగిపోయాయి. 


అపార్థాలకు తావు లేదు. ఒకరంటే ఒకరికి గౌరవం, ప్రేమ, వాత్సల్యం, భక్తీ. ఆనతికాలం లోనే ఆ కుటుంబం అన్ని విధాలుగా ఆ పల్లెకు తలమానికమైంది. 
ఈ కథకు బొమ్మను వేసినది ప్రముఖ చందమామ చిత్రకారులు "సునీతా వాసు". 
ఇది సేకరించి సంస్కరించిన కథ - దాసరి వెంకటరమణ
0

మడిలో ఒడిలో బడిలో గుడిలో - Lyric Analysis
పల్లవి: కథానాయిక: అస్మైక యోగ, తస్మైక భోగ, రస్మైక రాగ హిందోళం… (అర్ధం: నాది ఒక యోగం, నీది ఒక భోగం! మనిద్దరం కలిస్తే అది ఒక రసమయమైన హిందోళరాగం!) అంగాంగ తేజ, శృంగార భావ, సుకుమార సుందరం… (అర్ధం: దేహం అంతా తేజస్సు, మనసున అంతా శృంగార భావం, నీ అందం కోమలం!) ఆచంద్రతార, సంధ్యాసమీర, నీహారహార భూపాళం… (అర్ధం: భూపాళరాగం ఉదయం ఆలయాలు తెరిచే వేళలో ఉపయోగిస్తారు… ఆ సమయంలో ఉండే చంద్రుడు తారలు, అలాంటి సంధ్య సమయంలో వీచే గాలి… నీహారం అంటే మంచు! సూర్యుడు రాక ముందు మంచు ఒక హారంలా ఉంటుంది భూమిపై… ఆనందతీర, బృందావిహార, మందారసాగరం…(మందర సాగరం) తీర అంటే పూర్తిగా! పూర్తి ఆనందం… బృందావనంలో చేసే విహారం… మందర పర్వతంతో చేసిన క్షీరసాగరమధనం… నీతో ఉన్న సమయం! వీటి వల్ల కలిగిన అనుభూతిలా ఉంటుంది!) కథానాయకుడు: మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపే శశివదనా... ఎక్కడ ఉన్నా కూడా నీ ఆలోచనే! (శశివదన = చంద్రుని వంటి ముఖము గలది) గదిలో మదిలో యదలో సొదలో నీవె కదా గజగమనా… || 2 || ఎక్కడ చూసినా నీవే ఉన్నావు! (గజగమనా = ఏనుగు వంటి నడక గలది) ఆశగా నీకు పూజలే చేయ, ఆలకించింది ఆ నమకం… ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి, పులకరించింది ఆ చమకం… అగ్రహారాల తమలపాకల్లె తాకుతోంది తమకం… || మడిలో|| ||అస్మైక యోగ|| నీకోసం పూజ చేస్తుంటే, ఆ నమకం వింటోంది! ప్రవర చెప్తునప్పుడు నువ్వు గుర్తుకొచ్చి నేను చెప్పిన ప్రేమ మంత్రానికి ఆ చమకం సైతం పులకరించింది! నీ మీద మోహం అగ్రహారంలో ఉండే తమలపాకులా తాకుతోంది! [ప్రత్యేకించి అగ్రహారంలో ఉండేవాళ్ళకి కానీ, అక్కడ నుంచి వచ్చిన వాళ్లకి కానీ, భోజనం ఎంత తప్పనిసరో తాంబూలం కూడా అంతే తప్పనిసరి! అందువల్ల అక్కడి వాళ్లకి తమలపాకులు అంత ఇష్టం! అంతే కాదు తమలపాకు పూజలలో వాడుతారు! చాలా పవిత్రంగా భావిస్తారు… కథానాయకుడు ఆగ్రహారానికి సంబంధించిన వాడు కాబట్టి ఈ పోలిక వాడారు] చరణం – 1: నవలలనా నీవలన, కలిగె ఎంతొ వింత చలి నాలోన… మిసమిసల నిశిలోనా, కసి ముద్దులిచ్చుకోనా… ప్రియ జఘన శుభ లగన, తల్లకిందలౌతు తొలి జగడాన… ఎడతెగని ముడిపడని, రస కౌగిలింతలోనా… కనులనే వేయి కలలుగా చేసి, కలిసిపోదాము కలకాలం వానలా వచ్చి వరదలా మారె, వలపు నీలిమేఘం || మడిలో|| చరణం – 2: ప్రియ రమణ శత మదన, కన్నె కాలుజారి ఇక నీతోనా… ఇరు యదల సరిగమన, సిగ పూలు నలిగిపోనా… హిమ నయన సుమ శయన, చిన్నవేలు పట్టి శుభతరుణానా… పనసతొన కొరికితినా, పరదాలు తొలగనీనా… పడకగది నుంచి విడుదలే లేని, విడిది వేచింది మనకోసం వయసు తొక్కిల్ల పడుచు ఎక్కిళ్ళు, తెచ్చె మాఘమాసం… || మడిలో|| ||అస్మైక యోగ|| ఇది విన్నాక, తెలుగు ఎంత బాగుందో అనిపించింది కదా! అదే మన తెలుగు… తెలుసుకోవాలే గాని తెలుగుకి మించిన లోతు లేదు… ఆస్వాదించాలే కానీ తెలుగుకి మించిన రసం లేదు… ప్రేమించాలే కానీ తెలుగుకి మించిన ప్రేయసి లేదు…

- Suresh Babu (From YouTube Comments)

Movie - Duvvada Jagannadham Lyrics - Sahithi


0

నేను - దేవుడుఆదివారం, అప్పుడే అమ్మ పెట్టిన ఆవకాయ అన్నం నెయ్యి వేసుకొని, ఒక రౌండ్ లాగించాక, టమాటా పప్పు గుమ్మడికాయ వడియాలు ఎక్కడ అలుగుతాయో అన్న భయంతో ఒక పట్టు పట్టి, కమ్మని పెరుగుతో భోజనానికి తాత్కాలిక సెలవు పెట్టి, ఇంటి వరండా వైపు కదిలా.. 

ఇంతలో "ఒరేయ్ గిరి !" అమ్మ పిలిచింది, 
"ఎన్నాళ్ళైందో ఇంటికొచ్చి మంచి భోజన చేసి, వచ్చినప్పుడు దిష్టి తీయలేదు, తీస్తానాగు" అంటూ వంటింట్లో కల్లు ఉప్పుతో వచ్చింది 

" ఇరుగు దిష్టి .. పొరుగు దిష్టి 
ఊరంతా దిష్టి.. ఊరవతల దిష్టి 
నవ్వినోళ్ల దిష్టి ..నవ్వనోళ్ల దిష్టి 
పొగిడినోళ్ళ దిష్టి .. పొగడనోళ్ళ దిష్టి 
కుళ్ళు మింగిన కళ్ళ దిష్టి 
నసుక్కున్న నోళ్ళ దిష్టి "

అని దిష్టి మంత్రం చదివి  చేతిలో ఉన్న ఉప్పులో  "తు.. తు"  ఉమిసి వెళ్ళిపోయింది. అమ్మ అంతే కొడుకంటే ప్రాణం, నాకు అమ్మ అన్న కూడా. 

ఈ గిరికి 23 వయసు రాగానే హైదరాబాద్ లో  అందరూ కోరుకున్నట్టే, ఒక software ఉద్యోగంలో చేరిపోయా. బ్రహ్మచారి జీవితంలా, ఆరకొర గా తినడం, అజీర్తి అయితే ఏడవడం 
వంటింట్లో కష్టాలు, శని ఆదివారాలు హోటల్లో ఇష్టాలు. ఇదిగో అప్పుడప్పుడు అమ్మ చేతి వంట కోసం పండగ ప్రయాణాలు. ఉగాది కోసం అని నిన్న రాత్రి ఇంటికి చేరా. నడి రాతిరిలో వచ్చా కదా రాత్రి నుండి దాచిన ప్రేమ ఒక్కసారిగా ఇదిగో ఇలా చూపించేస్తుంది, అంత రాత్రి ఎందుకు అయిందంటే మా బస్సు డ్రైవర్ పుణ్యం వలన అదో  కథ. వినే ఓపిక మీకున్న చెప్పే సహనం నాకు లేదులెండి.


వరండాలో ఉన్న కుర్చీలో ఉన్న ఈనాడు అదివారం పుస్తకం చదువుతూ నిద్రా దేవి ఆవహించి రెప్పలు మూత పడుతున్న సమయంలో ,  బయట నుండి గేట్ చప్పుడైంది. నాన్న 
ఏరా నిద్ర వస్తే వెళ్లి లోపల పడుకోరా బయట గాలి దుమ్ము లో ఎందుకు అనేసి లోపలి వెళ్ళిపోయాడు. విన్నట్టే తల ఊపినా నిద్ర దేవి వరానికి బానిస అయ్యే క్రమంలో ఉండగా. 

"ఒరేయ్ గిరి.. రేపు పొద్దున్నే లేదా గుడికి వెళ్లి కళ్యాణం చేయించాలి, నాలుగుగంటలకు లేవాలి సరేనా.. " అని అమ్మ, దానికి నేను "అంత పొద్దున్నేనా ? ఎందుకమ్మా "  
"ఉగాది కదరా, పండగకోస్తే స్వామీ వారి కళ్యాణం చేయిస్తా అని మొక్కున్నా రా ! "
"పండగకి వస్తే మొక్కేంటి అమ్మ, నీ పిచ్చి కాకపోతేను.. "
"మన చుట్టూ మనలని ప్రేమించేవాళ్ళు, మనం ప్రేమించేవాళ్ళు ఉంటేనే ఆనందం రా, అలా ఉంటేనే కదా పండగ,  నువ్వెక్కడో నెలల కొద్దీ అక్కడ ఉంటే మాకు ఆనందం ఎక్కడిది రా, నువ్వొస్తే సంతోషం ఆ సంతోషం దేవుడితో ఇది ఇలా పంచుకుంటేనే నాకు తృప్తి " అని అమ్మ కళ్ళు చెమర్చుకొని లోపలికి వెళ్ళింది. 

నాకు మాట రాలేదు. నిజంగానే అమ్మ నాన్నలని నేను ఉద్యోగం సంతోష పెట్టానా ? దూరంగా ఉంది బాధ పెడుతున్నానా అని అర్ధం కాలేదు. 

"అర్ధం అయ్యేలా నన్ను చెప్పమంటావా? " అని గొంతు వినపడింది, వినడానికి గంభీరం గా ఉన్న ఎంతో హాయిగా అనిపించింది. ఆ గొంతులో ఆత్మవిశ్వాసం వినపడుతుంది. నేనున్నా అన్న ధైర్యం తెలుస్తుంది. 

"ఎవరు ?" నేను, కొద్దిగా భయపడుతూ.

(సశేషం)
0

కవన ప్రణవుడు - Pranav Chaganty" దిల్లు ఫుల్లు కుష్ జేసే కవిత చెవినబెడత నేను." అంటూ తెలుగు కవితకి కొత్త రూపం ఇచ్చిన ప్రణవ్ చాగంటి. Rap సంగీతం తెలుగులో సాధ్యపడదేమో అన్న సందేహాన్ని బద్దలు చేసి నవ కవితా విధానానికి తొలి తలుపు తీసాడు. తన పేర్చిన కవన మాలలో కొన్ని పూలు ఇవిగో
SunRisers కోసం మరో తెలుగు Rap తో మన ముందుకు వస్తున్నాడు..


0

Real Life పిల్ల జమీందార్


కొడుక్కి వింత పరీక్ష పెట్టిన బిలియనీర్!
కొచ్చి బేకరిలో పనిచేసిన వేలకోట్ల ఆస్తికి వారసుడు
సూరత్: అతడో బిలియనీర్. కోట్లకు పడగెత్తిన అతడికి ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు. చేతికి అందొచ్చిన తన కొడుక్కి జీవితం అంటే ఏంటో తెలిపాలనుకున్నాడు ఆ బిలియనీర్. ఉద్యోగాలు, డబ్బు సంపాదించడానికి సామాన్యులు ఎంత కష్టపడుతున్నారో చూపించాలనుకున్నాడు. నెల రోజుల పాటు సామాన్యుడిలా కష్టపడి పనిచేసి రావాలని కొడుకుని ఇంటి నుంచి పంపించేశాడు. ఇది సినిమా కథ కాదు. నిజంగా జరిగిన స్టోరి.
గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్‌జీ ఢోలకియా కుమారుడు ద్రావ్య(21) అమెరికాలో ఎంబీఏ చేస్తున్నాడు. సెలవులకు ఇంటికి వచ్చిన కొడుకును నెలరోజుల పాటు సామాన్యుడిలా జీవించమని సావ్‌జీ ఆదేశించాడు. జూన్ 21న మూడు జతల బట్టలు, రూ.7 వేలు ఇచ్చి వెళ్లమన్నారు. తాను ఇచ్చిన డబ్బు అత్యవసర సమయాల్లో మాత్రమే వాడాలని, ఫోన్ వినియోగించరాదని షరతులు విధించాడు. తండ్రి ఆదేశాల మేరకు కొచ్చి చేరుకున్న ద్రావ్య మొదట బేకరిలో చేరాడు. తర్వాత కాల్ సెంటర్, చెప్పుల దుకాణం, మెల్ డొనాల్డ్ అవుట్ లెట్ లోనూ పనిచేశాడు. నెల రోజుల్లో రూ. 4 వేలుపైగా సంపాదించాడు. తండ్రి పెట్టిన పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుని మంగళవారం ఇంటికి తిరిగొచ్చాడు.
'మొదటి ఐదు రోజులు ఎంత తిరిగినా ఉద్యోగం దొరకలేదు. 60 చోట్లకు వెళ్లినా నిరాశ ఎదురైంది. నేనెవరో తెలియక ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించాడు. అపుడు తెలిసింది ఉద్యోగం సంపాదించడం చాలా కష్టమని. డబ్బు గురించి ఆలోచించలేదు. నేను సంపాదించిన దాంట్లో రూ.40 పెట్టి భోజనం చేసే వాడిని, లాడ్జికి రోజుకు రూ.250 చొప్పున ఇచ్చాన'ని చెప్పాడు.
'ఇంటి నుంచి పంపేటప్పుడు ద్రావ్యకు మూడు షరతులు పెట్టాను. సొంతం పనిచేసి డబ్బు సంపాదించుకోవాలి. నా పేరు ఎక్కడా వెల్లడించకూడదు. మొబైల్ ఫోన్ వాడకూడదని షరతులు విధించాను. ఇంటి నుంచి తీసుకెళ్లిన ఏడు వేల రూపాయలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడాలని చెప్పాను. ఉద్యోగాలు, డబ్బు సంపాదనకు సామాన్యులు పడుతున్న కష్టాల గురించి నా కుమారుడు తెలుసుకోవాలని ఇదంతా చేశాను. జీవిత పాఠాలు ఏ యూనివర్సిటీలోనూ చెప్పరు. అనుభవాన్ని మించిన పాఠం లేద'ని సావ్‌జీ ఢోలకియా అన్నారు.
హరేకృష్ణ డైమండ్ ఎక్స్ పోర్ట్స్ పేరుతో సూరత్ కేంద్రంగా వజ్రాల వ్యాపారం సాగిస్తున్న ఆయన తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు గతేడాది దీపావళికి ఖరీదైన బహుమతులు ఇచ్చి పతాక శీర్షికలకు ఎక్కారు. 491 ఫియట్ పుంటో కార్లు, 200 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. ఇంకా ఆభరణాలు మొదలైనవి ఉద్యోగులకు పంచారు. 71 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఢోలకియా ఆస్తుల విలువ రూ.6000 కోట్లు1

విడాకులు
భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి, వాళ్ళ భార్య భోజనం వడ్డిస్తూ వుంది. భర్త ఆమె చేయి పట్టుకుని, నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు. ఆమె కూర్చుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. ఆమె కళ్ళలో బాధని భర్త గమనించాడు. అతను ఆమె తో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు. కానీ ఆమె కి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు..ఎలాగయినా ఆమె కి ఆ విషయం చెప్పాలి.. చివరికి ఇలా చెప్పాడు...
.

భర్త - నాకు విడాకులు కావాలి అని  ప్రశాంతంగా తన తో అసలు విషయం చెప్పాడు.
.

భార్య - (ఆ మాటలకి  బదులుగా ఆమె ) ఎందుకు అని మాములుగా అడిగింది?
.

భర్త - ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా సమాధానం ఏం ఇవ్వలేదు..
.

భార్య - (ఆమెకి కోపం వచ్చింది.) ఆమె ఒక వస్తువును దూరంగా విసిరేసి, మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచింది..
.

ఆ రాత్రి, వాళ్లిద్దరూ మాట్లాడుకోలేదు. ఆమె బాగా ఏడ్చింది. భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడో అసలు ఏమి జరిగిందో తను తెలుసుకోవాలి అనుకుంది. భర్త ని గట్టిగా అడిగింది..భర్త ఆమెకి సమాధానం ఇలా చెప్పాడు.
.

భర్త - నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను. నాకు నీపైన ప్రేమ లేదు..
.

భార్య - ఆ మాటలు విన్న తాను చాలా బాధపడింది.. ఒక నిమిషం ఏం అవుతుందో తనకేం అర్థం కాలేదు..
.

భర్త - గిల్టీ ఫీలింగ్ తో నాకు నువ్వు విడాకులు ఇవ్వడానికి నువ్వు వొప్పుకునేందుకు , నువ్వు ఉండడానికి సొంత ఇల్లు , కారు అండ్ నా సంస్థ లో 30% వాటా ఇస్తా అని అగ్రిమెంట్ పేపర్లు తనకి ఇచ్చాడు..
.

భార్య - చాలా కోపం తో ఆ పేపర్లు ని చింపేసింది.. ప్రేమ ని ఎప్పటికి కొనలేరు అని గట్టిగా ఏడిచేసింది..
.

భర్త గా తన లైఫ్ లో ఒక తెలియని వ్యక్తి లా ఆమె జీవితంలో పది సంవత్సరాలు వున్నాడు. అతని భార్య సమయం వృధా చేసానని బాధ పడుతున్నాడు. అతను తన భార్య ని అర్థం చేస్కునే ప్రయత్నం ఎప్పుడు చెయ్యలేదు.కానీ అతను జాను ని మాత్రమే ప్రేమిస్తున్నాడు.. ఏడుస్తున్న తన భార్య ని చూస్తే అతనికి జాలి వేసింది. ఆ విడాకులు రావడానికి కొన్ని వారాలు పడుతుంది..
.

మరుసటి రోజు, అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అతని భార్య టేబుల్ వద్ద ఏదో రాస్తు కనిపించింది. అతను భోజనం చేయలేదు కానీ అతనికి వెంటనే నిద్ర పట్టేసింది. ఏందుకుంటే ఆ రోజంతా అతని లవర్ జానూ తో కలిసి రోజంతా తిరగటం వల్ల, బాగా అలసిపోయి త్వరగా నిద్రపోయాడు. అతను నిద్ర లేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గర ఇంకా రాస్తూ కనిపించింది. అతను తన భార్య ని పట్టించుకోకుండా, పక్కకి తిరిగి మళ్ళీ నిద్రపోయాడు.
.

ఉదయం, ఆమె విడాకులకు సంబధించి కొన్ని షరతులు చెప్పింది. ఆమె అతని నుండి ఏమి కోరుకోవటంలేదు, కానీ విడాకులు ముందు ఒక నెల రోజుల పాటు అతను తన తో  వుండాలని చెప్పింది. ఆ నెలలో మనం సాధ్యమైనంత వరకు సాధారణమైన జీవితాన్ని గడపాలి అని అంది.
.

ఆమె కారణాలు చాలా సాధారణం గా  ఉన్నాయి. వాళ్ళ  కొడుకుకు ఒక నెల రోజుల్లో పరీక్షలు వున్నాయి. వాళ్ళ విడాకుల వల్ల తన చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆమె అలా కోరుకుంటుంది. అందుకే తను, వాళ్ళ భర్త ని నెల రోజులు గడువు అడిగింది.
.

నాకు అంగీకరమే అని వాళ్ళ భర్త ఆమె తో చెప్పాడు. కానీ ఆమె అతన్ని మరొకటి అడిగింది. ఆమె అతనికి గుర్తు చేస్తూ ఇలా అడిగింది, మీరు మన పెళ్లి రోజున నన్ను మన పెళ్లి గదిలోకి ఏలా తీసుకువెళ్ళారు గుర్తుందా అని అడిగింది. ఆమె ఈ నెల రోజుల వ్యవధిలో ప్రతి రోజు ఉదయం  ఆమె ని ఎత్తుకుని  వాళ్ళ బెడ్ రూమ్ నుండి హల్ వరకు తీసుకువెళ్లాలని కోరింది. అప్పుడు అతడు ఆమె కి  మతిపోయిందా అని అనుకున్నాడు. వాళ్ళు కలిసివుండే చివరి రోజులలో, తాను అతన్ని అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పిన దానికి ఒప్పుకున్నాడు.
.

అతను ఆమెతో విడాకులు, అతని భార్య చెప్పిన షరతులు గురించి అతని లవర్ జానూ కి చెప్పాడు. ఆమె బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వు కి అర్ధంలేనట్లుగా అతను భావించాడు. నీ భార్య, నీకు విడాకులు ఇవ్వటం ఇష్టం లేక ఇలా ఏవో నాటకాలాడుతుంది అని జాను  అతని తో అంది..
.

విడాకుల ఒప్పందం దగ్గర నుంచి అతనికి , అతని భార్యకు ఏలాంటి శారీరక సంబంధం లేదు.
.

మొదటి రోజున తాను తన  భార్యను ఎత్త్తుకున్నప్పుడు, అది వాళ్ళిద్దరి మధ్య  మోటుతనంగా అనిపించింది. "హేయ్..! నాన్న, అమ్మను ఎత్తుకున్నాడు అని వాళ్ళ అబ్బాయి సంతోషంతో అరుస్తూ చప్పట్లుకొట్టాడు". ఆ అబ్బాయి మాటలు అతనికి కు బాధను కలిగించాయి. అలా ఎత్తుకుని తీసుకువెళ్తున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకొని నెమ్మదిగా తన తో ఇలా చెప్పింది. "మన విడాకుల గురించి నేను మన అబ్బాయికి చెప్పలేదు. అతనికి కొంత బాధ కలిగినా, నవ్వాడు.. అతను ఆఫీస్ కి వెళ్తున్నదని ఆమె తలుపు దగ్గరకి  వచ్చింది... ఆమె ఆఫీస్ బస్సు కోసం ఎదురుచూస్తుంది. తాను ఆఫీసుకు ఒక్కడే , ఒంటరిగా కారులో వెళ్ళిపోయాడు. .
.

రెండవ రోజు న  , వాళ్ళిద్దరికీ మరింత తేలికగా అనిపించింది..ఆమె తల తన గుండె ని తాకుతుంది..ఆమె దగ్గర సువాసన తనకి తెలుస్తుంది.. తాను కొంత కాలంగా తన భార్య ని గమనించలేదు అని అనుకున్నాడు. ఆమె వయసు పైబడుతుందని అతను గ్రహించాడు. ఆమె ముఖం మీద ముడుతలు కనిపిస్తున్నాయి, ఆమె జుట్టు ఎగురుతుంది. మన వివాహం మూల్యం చెల్లిస్తున్నాను అని అనుకుంటున్నారా అని భర్త ని భార్య  అడిగింది. అలా అడగగానే ఒక నిమిషం పాటు ఆలోచిస్తు తాను ఆశ్చర్యపోయాడు..
.

నాలుగో రోజు, తాను ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య దగ్గరితనం, అన్యోన్యత అతనికి కనిపించింది. ఈ  అమ్మాయితోనేనా నేను పది సంవత్సరాల జీవించిదని అతనికి అనిపించింది.
.

ఐదవ మరియు ఆరవ రోజున, వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్నందని తాను తెలుసుకున్నాడు. తాను ఈ విషయం గురించి జాను  కి చెప్పలేదు. ఇలా నెల రోజులు తన భార్యను తీసుకుని వెళ్ళటం సులభంగా మారిపోయింది. బహుశా రోజు ఇలా చేయటం వల్ల తనకు తానే బలంగా, దృఢంగా అనిపించాడు.
.

ఒక ఉదయం తాను ఏ డ్రెస్ వేసుకోవాలో వెతుకుతుంది. తాను కొన్ని డ్రెస్ లు ట్రై చేసింది కానీ ఒక్క  డ్రెస్ కూడా తనకి బాగోలేదు. వేసిన ప్రతి డ్రెస్ కూడా తనకి లూస్ గానే ఉంది.. అప్పుడు అతనికి అర్థం అయ్యింది తను చాలా సన్నగా అయ్యింది అని.. అందుకనే అతను తనని తేలికగా మోయగలిగాను అని.. ఆ విషయం అతనికి బలం గా తగిలింది.. ఆమె గుండెల్లో ఎంత బాధ అనుభవిస్తుందో అప్పుడు అతనికి అర్థం అయ్యింది.. అతనికి తెలియకుండానే అతని చేయి ఆమె తల ని తాకింది... ఆ సమయం లోనే వాళ్ళ అబ్బాయ్ వచ్చాడు..
.

ఆ సందర్భాన్ని చూసిన ఆ అబ్బాయి వాళ్ళ నాన్న తో ఇలా అన్నాడు.."నాన్న అమ్మని బయటికి తీసుకెళ్లే సమయం ఇప్పుడు వచ్చింది.." అని అన్నాడు.. ఇలా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అలా చూసుకోవడం ఆ అబ్బాయిజీవితంలో విలువైన, అపురూపమైన సంఘటన..
.

అతని భార్య, వాళ్ళ అబ్బాయిని ఆమె దగ్గరకు రమ్మని సైగ చేసింది, వాడు వాళ్ళ అమ్మ దగ్గరకి వచ్చాడు.. వాళ్ళ అమ్మ ఆ అబ్బాయ్ ని గట్టిగా హత్తుకుంది.వాళ్ళ నాన్న ముఖం పక్కకి  తిప్పుకున్నాడు ఎందుకంటే ఆ చివరి నిమిషంలో తన మనసు తాను మార్చుకుంటాడేమో అని భయపడ్డాడు.
.

రోజులానే అతను ఆమె ని ఎత్తుకుని బెడ్ రూం నుండి హల్ కి వెళ్తుండగా ఆమె తన చేతులను అతని మెడ చుట్టూ ప్రేమ గా, సహజం గా  వేసింది.. అతను ఆమె ని గట్టిగా పట్టుకున్నాడు అచ్ఛం వాళ్ళ పెళ్లి రోజులాగా, కానీ ఆమె చాలా తేలికగా వుండటం వలన అతనికి చాలా బాధ  గా అనిపించిది.
.

చివరి రోజున, అతను ఆమెను తన చేతులతో ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కో అడుగు వేయటానికి తనకి చాలా భారంగా అనిపించింది. వాళ్ళ అబ్బాయి స్కూలుకి వెళ్ళిపోయాడు. అతను వాళ్ళ  భార్యను మరింత గట్టిగా పట్టుకుని తనతో ఇలా చెప్పాడు, "మన జీవితంలో సాన్నిహిత్యం, అన్యోన్యత లోపించాయి" అని చెప్పాడు..
.

తర్వాత అతను ఆఫీసుకు వెళ్ళిపోయాడు. కారు నుండి వేగం గా దిగి, డోర్ కూడా వేయకుండా ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. అతనికి భయం వేసింది ఎందుకంటే ఆలస్యం అయ్యేకొద్దీ తన మైండ్ మళ్ళీ  చేంజ్ అయిపొతుందెమో అని.
.

అతను జాను వుండే క్యాబిన్ కి వెళ్ళాడు.. సారి చెప్పి , అతను తన భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదని చెప్పాడు. ఆమె(జాను) అతని వైపు ఆశ్చర్యంగా చూసి, తన నుదిటిపై చేయి వేసింది. నువ్వు బాగానే వున్నావ్ కదా? అని అడిగింది. అతను తన  నుదిటి మీద వున్న ఆమె చేతిని తీసి, సారీ జాను  నేను నా భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదు. మా వివాహా జీవితం నాకు  విసుగుగా అనిపించేది ఎందుకంటే నాకు,తనకి  ప్రేమ విలువ, గొప్పతనం  తెలియలేదు. మేము ఎప్పుడు ప్రేమ గా మాట్లాడనుకోలేదు అందుకే మాకు ఎలా కలిసి జీవించాలో అర్థం కాలేదు..ఎప్పుడయితే నేను తనని అలా ఎత్తుకుని తీసుకెళ్లడం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థం అయ్యింది తను చనిపోయే దాకా నేను తనని అలానే చూసుకుంటానని అచ్ఛం మా పెళ్లిరోజు లానే....
.

జాను  హఠాత్తుగా లేచి, అతనిని ఒక చెంప దెబ్బ కొట్టింది. ఏడుస్తు తన ని బయటకి పంపి తలుపు వేసింది. ఇంక అతను ఇంటికి వెళ్తూ దారి లో పూల దుకాణం వద్ద, తన భార్య కోసం ప్లవర్ బొకే ఆర్డర్ ఇచ్చాడు.
.

కార్డ్ మీద ఏమి రాయాలి అని ఆ సేల్స్ గర్ల్ అతన్ని అడిగింది .
.

అప్పుడు అతను నవ్వుతూ "మరణం మనల్ని దూరం చేసేవరకు... నేను నిన్ను మోయాలి అని అనుకుంటున్నాను ." అని రాయమని చెప్పాడు..
.

ఆ సాయంత్రం అతను ఇంటికి త్వరగా వెళ్ళాడు. తన చేతిలో ఒక ఫ్లవర్ బొకే,  తన ముఖం మీద చిరునవ్వుతో అతను మెట్లు ఏక్కి పైకి వెళ్ళాడు .తన భార్యను మంచం మీద చూసాడు.
.
.
.
.
.
.
.
.
అప్పటికే ఆమె చనిపోయింది.
.

ఒక్కసారి అతని కి ఏం అర్థం కాలేదు.. తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్..
.

 తన భార్య కొన్ని నెలలగా క్యాన్సర్ తో పోరాడుతుంది. తాను జాను  తో బిజీగా వుండటం వల్ల ఈ విషయం తను  గమనించలేకపోయాడు. ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకి తెలుసు. ఆమె వాళ్ళ సంసార మరియు విడాకుల విషయాలు సంగతి వీలైనంతవరకు వాళ్ళ కొడుకుకు దూరంగా వుంచి, తనని సేవ్ చేసింది. కనీసం వాళ్ళ కొడుకు దృష్టిలో అతను ఒక ప్రేమించే భర్తగా వుండాలి అనుకుంది.
.

Source: WhatsApp
0