భార్య భర్తలు
భర్త : పెళ్లికి ముందు నాతో ఉంటె స్వతంత్రం కన్నా హాయిగా ఉంది అని చెప్పింది, ఇప్పుడు స్వతంత్రమే కావాలని లెక్కలు వేస్తుంది.. 
భార్య : పెళ్ళికి ముందు తనకి నాకంటే ముందు ఏది లేదు.. పెళ్లి అయ్యాక అన్ని నాకన్నా ముందు ఉన్నాయి 

భర్త: అరె .. భర్తగా బయట ఎన్నో పనులు ఉంటాయి .. అన్ని చెప్పాలంటుంది .. 
భార్య: భార్య గా అడిగే హక్కులు ఉండవా ....  దీన్లో తప్పేముంటుంది.. 

భర్త: హక్కులు చూపడానికి ఇది రాజ్యాంగం కాదు.. జీవితం 
భార్య: నిజాలు దాచడానికి ఇది జైలు కాదు .... ఇల్లు


భర్త : ఆవేశంతో పెళ్లి చేసుకుని తప్పు చేసానా అనిపిస్తుంది 
భార్య : ఆలోచన లేకుండా పెళ్లి చేసుకొని తప్పు చేసానా అనిపిస్తుంది 

భర్త: ఎన్నో వదులుకున్నా దీని కోసమేనా ?
భార్య: అమ్మ నాన్నలకి దూరమయ్య వీడి  కోసమేనా ?

(గొడవ పడ్డ ఇద్దరు ఎవరి ఇంటికి వారు వెళ్తారు .. కోపం తో భార్య  ఏమి చేయలేక  ఏడుస్తూ  ఉంటుంది .. ఆవేశంలో భర్త తాగుతూ ఉంటాడు.. 

మరుసటి రోజు వారిద్దరి పెళ్లి రోజు కావడం తో .. ఒక్కొక్కరికి friends అంతా కాల్ చేసి విష్ చేస్తూ ఉంటారు )

భర్త: thanks రా .. ఈరోజు special  ఎం లేదు రా .. 
freind (In Phone ): మీ పెళ్లి video ఇంకా గుర్తు ఉంది రా ... చాలా బాగా వచ్చింది రా .. ఒకసారి చూసి మొత్తం recollect చేసుకోండి .. once again happy anniversary .. enjoy..! 

భార్య: thank you .. ఎక్కడికీ వెళ్ళలేదు.. 
freind (In Phone ): ఓహ్ special  plan చేసారా ..? మాకేం చెప్పోద్దులే ... అన్నట్టు చెప్పడం మరిచి పోయా .. మీ పెళ్లి ఫోటోలు ఇందాక facebook లో చూసా .. ఇద్దరు made for  each other లా ఉన్నారు .. ఎప్పుడూ అలాగే హ్యాపీ గా ఉండండి .. అల్ ది బెస్ట్ .. bye .. 

భర్త: (ఫోన్ కట్ చేసి )మర్చి పోవాల్సిన జ్ఞాపకాలు చూడటం దేనికి ?
భార్య : (ఫోన్ కట్ చేసి ) తుడి చేయాల్సిన గుర్తులు ఇంకా facebook  లో ఎందుకు ?

(అనుకోని ఇద్దరు వాళ్ళ జ్ఞాపకాలను, గుర్తులను మరిచే ముందు )

భర్త : వీడియో అంత బాగా వచ్చిందా ... ? వాడు అబద్ధం చెప్పాడా ? ఎలాగు పారేస్తాం .. ఒకసారి చూసి విసిరేద్దాం ... !
భార్య : ఇద్దరం made  for each other ... ? ఆ ఫోటోలకు అంత సీన్ ఉందా ? ఎలాగు delete  చేస్తాం కదా , చూసేసి చేద్దాం .. !

(కొన్ని close up  షాట్స్ ) కొంత సమయం తర్వాత ఇద్హరూ వీడియో, ఫోటోలు చూస్తూ .. 

భర్త : ఆ పెళ్లి చీరలో తను ఎంత అందంగా ఉంది.. !
భార్య : ఈ reception suit  తనకి బాగా సూట్ అయింది .. !

భర్త : తాళి కట్టేప్పుడు ఇంత సిగ్గు తనలో నా ... ? నేను గమనించ లేదే .. !
భార్య : తలంబ్రాలకి ఎంత సిగ్గో వీడికి .. ఫోటో తీస్తున్న సంగతే మర్చిపోయాడు .. !


భర్త : అమ్మ  ఎంత హ్యాపీ గా ఉందొ... నాన్న మొహం లో పెళ్లి బాగా జరిగిందనే సంతోషం కనపడుతుంది . 
భార్య : పెళ్ళయ్యాక  నేను వెళ్తున్నారని నాన్న కంట్లో కన్నీరు first time  చూసా .. ఆరోజు తను కూడా ఓదార్చాడు .. 

(ఇద్దరు ఒకరి మనసులో ఒకరు  - విత్ క్లోజ్ అప్ షాట్స్ )

భర్త : ఈ వీడియో లో జ్ఞాపకాలు కాదు .. 
భార్య : జీవితాలు ఉన్నాయి 

భర్త : విసిరేస్తే పాపం .. 
భార్య :తుడి చేస్తే నేరం .. 

భర్త : మమ్మల్ని నమ్మి ఇంతమంది కలిసి పెళ్లి చేసారు .. కాదని విడిపోతే  వీళ్ళందరినీ మోసం చేసినట్టు కాదా .. ?
భార్య : మా వాళ్ళ రెండు కుటుంబాలు దగ్గరయ్యాయి .. మేం దూరమయ్యి .. ఎవరికీ దగ్గరవ్వాలని .. ?

భార్య : క్షమించమని అడగకపోవడం తన తప్పు అయితే .. క్షమించకపోవడం నా తప్పు 
భర్త : తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ... తప్పు నాదే 

(ఒకరినొకరు కాల్ చేస్తారు .. engage వస్తూ ఉండటం తో కలవాలని బయలుదేరుతారు .. )
 Long  shot లో ఇద్దరు కలిసాక కళ్యాణ మండపం ... క్లోజ్ అప్ లో 

భర్త , భార్య : SORRY (ఇద్దరు ఒకేసారి చెప్పి నవ్వుకుంటారు )


భార్య  : అవును ..  నేను ఇక్కడికే వస్తానని ఎలా కనిపెట్టావ్ .. !
భర్త : ఈరోజు మన పెళ్లి రోజు కదా .. ఆ ఘోరం జరిగింది ఇక్కడే కదా .. !
భార్య : ఏయ్ .. 
భర్త : సారీ .. 


మనం లైఫ్ లో కొన్ని  సార్లు సర్దుకు పోతాం .. కొన్ని సార్లు సర్దుకు పోలేం .. 
మనిషి గా గెలవాలంటే ఎక్కడా adjust అవ్వకూడదు .. మనసులని గెలవాలంటే ఎక్కడైనా adjust  అవ్వాలి .. 

పెళ్లి ఎప్పుడూ జ్ఞాపకం కాకూడదు  .... రెండు జీవితాలు నడిచే మార్గం కావాలి..  


పెళ్లి జ్ఞాపకం కాకూడదు .. జీవితం అవ్వాలి