కొంటె మాటలొద్దు నీ కళ్ళే పలికెనులే !!

కొంటె మాటలొద్దు నీ కళ్ళే పలికెనులే !!

కొంటె మాటలొద్దు నీ కళ్ళే పలికెనులే !!

పల్లవి :

కొంటె మాటలొద్దు నీ కళ్ళే పలికెనులే

కొంటె చూపు చాలే ఆ వర్షం కురిసెనులే

అలుపెరుగని అడుగులు నన్నే , నీ నీడను అడిగెనులే

కనపడనీ చూపులు నాకే , నీ ప్రేమని చూపెనులే

దూరమే దూరమై పోయే వేళా ...

|| కొంటె ||

చరణం 1:

ఆశే నను కోరినా .. గుండె తడబడినా

వెంటే పరుగులు తీసే .. నా మనసే నిలిచేనా .

అలలే అడుగడుగునా .. కలలే నిజమైన

ఎదురుగ నిలిచిన నువ్వే .. ప్రేమగ వరమైంది..

చుర చుర చూపులే .. పదునే దాచింది

దాచిన పదునుతో .. గుండె కోసింది

దారే లేదంది .. దారుణం చేసింది

అద్దం చూపని అందం నీదంది

|| కొంటె ||

కొంటె మాటలొద్దు నీ కళ్ళే పలికెనులే

©jaabilamma

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి