మనసు నిలబడిపోయింది

మనసు నిలబడిపోయింది

మనసు నిలబడిపోయింది

చీకటిలో రేయీ లో ఈ రోజు మరణం!!

రేపటి వెలుగు రేఖలో మరో కొత్త జీవితం!!

పున్నమి చంద్రుడు సాక్షిగా సాగుతున్న జీవనయానం!!

సంతోష క్షణాలు , భారమైన రోజుల్ని తాకుతూ ఒక్కో మెట్టు ఎక్కుతున్న వసంతం!!

అదృష్టం అనుకోవాలో ఏమో !! అలసిన నా మనసుకు ,

సంద్రం లో దొరికిన శంఖంలా, స్వాతి చినుకు దాచుకున్న ముత్యం లా !!

అగ్ని కంటే స్వచ్ఛంలా , ప్రాణంతో అంటిపెట్టుకున్న కాలంలా ,

కనిపించిన మనసు తో , కలసి కొత్తగా మొదలైయింది నా ప్రయాణం!!

గమ్యం లేని మజిలీలో వేస్తున్న అడుగులో ప్రతి రోజు ఒక తడబాటు !!

నిలబడిలేచి వేసిన ప్రతి అడుగుల క్రింద ఎన్నో అనుభూతులు అనుభవాలు !!

ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే , నడిచిన దారంతా పరిమళాలు గుబాళింపు !!

నాతో అడుగువేసిన మనసును చూస్తూ నా మనసు నిలబడిపోయింది!!

నా హృదయం ఆగిపోయింది !! శరీరం కాలిపోయింది !!

వచ్చే జన్మంటూ ఉంటే , నేను కళ్ళు తెరిచి మొదటగా చూడాలనుకునేది ఆ మనసునే!!

ఒక్కటై బతికేది .. బతికించేది స్నేహం ఒక్కటే !!

__బాల

©jaabilamma

1 వ్యాఖ్య: