ఎవరికి స్వాతంత్రం - Evariki Swathantram

ఎవరికి స్వాతంత్రం - Evariki Swathantram

ఎవరికి స్వాతంత్రం - Evariki Swathantram

నా దేశానికీ పట్టిన కరుడుకట్టిన ముష్కర దరిద్రమా మమ్మల్ని విడిచి వెళ్ళిపో !!

మనిషిలోతులో పాతుకుపోయిన అహం, మతం మూర్ఖత్వమా నా దేశం విడిచి వెళ్ళిపో !

మాయమాటలతో మోసగించే ప్రజా రాజకీయ విషవృక్షమా తక్షణం నేల కూలిపో !!

పేద, ధనికా మధ్య అంతరం ఇకనైనా మాసిపో ,

మనిషి నెత్తురు మరిగించే సినీ రక్త చరిత్రమా నా దేశం విడిచి వెళ్ళిపో!!

ప్రేమ అనే మత్తులో మనిషిని మనిషిని చంపే ఉన్మాద భూతమా నా దేశం విడిచి పారిపో!!

రైతులను ఆత్మహత్యకు పురిగొల్పే కరువురక్కసి దరిద్రమా నా దేశం విడిచి వెళ్ళిపో!!

డబ్బు కోసం పిల్లలను ఎత్తుకెళ్ళే దురాశా పిశాచమా నా దేశం విడిచి వెళ్ళిపో!!

బంగారం కోసం తల్లి చెల్లి , గొంతులు కోసే పైశాచిక దరిద్రమా నా దేశం విడిచి వెళ్ళిపో !!

రాజకీయనాకుడు తేలేదురా స్వాతంత్రం , ఎందుకురా నీకు వాడి కాళ్ళు మొక్కే ఖర్మం !!

ఎవరికీ వచ్చిందిరా స్వాతంత్రం , పేదల కడుపుకొట్టి బతికే బడా నాయకులకా !!

దేశం లో సొమ్ములు కొల్లకొట్టి , విదేశాల్లో దాక్కునే ఘరానా మోసగాళ్లకా !!

ఎన్ని వేలకోట్లునా, నాణ్యమైన చదువు, వైద్యం , రక్షణ లేని నా దేశం స్వాత్రంత్రం వచ్చిందంటూ , మౌనంగా రోదిస్తూ వయస్సు పెంచుకుంటూ ముందుకెళ్తూనే ఉంది!!

నేతులు తాగిన మూతుల చరిత్రలు వినిపించడం ఆపరా !!

తరతరాలు ముందు తరాల ముత్తాతలు చెప్పుకునేలా నిర్మంచరా నా దేశ భవిష్యత్తుని !!

ఈ దేశం లో రైతులు ,పిల్లలు , ఆడపచులు , సమస్త జీవనావళికి ఎక్కడ భరోసా ఉన్నదో అక్కడే ఆరోజే జరుపుకుందాం నిజమైన స్వాతంత్రం పండుగ !!

నీకు స్వాతంత్రం వచ్చింది అనే చెప్పిన, అమరవీరుల అస్తికలు భద్రంగా సమాధిలో ఉన్నాయి!!

వీలైతే వెళ్లి వాళ్ళకి మనస్పూర్వకంగా నమస్కారం పెట్టుకో!!

గుండెల నిండా ధైర్యం నింపుకో ,ఈ జాతిని నువ్వు ఒక్కడివైనా జాగృతం చేయగలవని తెలుసుకో !!

బాల

©jaabilamma

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి