గడియారం చూడని రోజులు కాలేజీ రోజులు : gadiyaaram chudani rojulu college rojulu

గడియారం చూడని రోజులు కాలేజీ రోజులు : gadiyaaram chudani rojulu college rojulu

గడియారం చూడని రోజులు కాలేజీ రోజులు : gadiyaaram chudani rojulu college rojulu

మనసు నిండిన మంచి రోజులు .. మరచిపోని కాలేజీ రోజులు .. మన కాలేజీ రోజులు..!

గడియారం చూడని రోజులు

గడిపే కాలం తెలియని రోజులు ..కాలేజీ రోజులు..!

నవ్వులెన్నో నాటుకున్న రోజులు

కన్నీళ్ళెన్నో దాచుకున్న రోజులు .. కాలేజీ రోజులు..!

కష్టం తన ఇష్టం చూపని రోజులు

ఇష్టం తన కష్టం ఎరుగని రోజులు .. కాలేజీ రోజులు..!

స్నేహాల రంగు అద్దుకున్న రోజులు

ప్రేమల హంగు దిద్దుకున్న రోజులు .. కాలేజీ రోజులు..!

బర్గర్లు పంచుకున్న రోజులు

బంధాలు పెంచుకున్న రోజులు .. కాలేజీ రోజులు..!

గురుతులెన్నో మలచిన రోజులు

గుణపాఠాలెన్నో నేర్చిన రోజులు .. కాలేజీ రోజులు..!

అబద్ధం ఆనవాయితీ అయిన రోజులు

నిజం నీడలేని రోజులు .. కాలేజీ రోజులు..!

అబ్బాయిల వేగానికి కాలం నలిగిన రోజులు

అమ్మాయిల సిగ్గు నవ్వుల వెనుక అణచిన రోజులు .. కాలేజీ రోజులు..!

మనసు నిండిన మంచి రోజులు .. మరచిపోని కాలేజీ రోజులు .. మన కాలేజీ రోజులు..!

©jaabilamma

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి