"కులం"కషం - KualmKasham part 2

"కులం"కషం - KualmKasham part 2

"కులం"కషం - KualmKasham part 2

అప్పుడు మొదట మాట్లాడిన పెద్దాయన లేచి "ప్రతి కులం వారూ వాళ్ళ కులస్థుల డాటా తో సెపరట్ గా బిల్డ్ చేసుకొని తర్వాత అన్నిటినీ ఇంటిగ్రేట్ చేద్దాం. ఆ కామన్ అప్లికేషన్ ని ఎంత ఖర్చయినా సరే ఏదైనా అమెరికన్ కంపెని తో డెవలప్ చేయిద్దాం" అని సలహా ఇచ్చారు. అందరూ అంగీకరించారు.

హమ్మయ్య...ఒక గొప్ప సమస్య తీరిపోనుంది అన్న ఆనందంలో అందరూ ఉండగా ఇంతవరకు మాట్లాడని ఇంకో గొప్ప కుల నేత లేచి "ఇలాంటివన్నీ ఇంటెర్నెట్ ఉంటేనే పనికొస్తాయ్.ఇంటెర్నెట్ లేనపుడు...ఇంకా చదువు రాని వాళ్ళకు ఇది ఎలా ఉపయోగపడుతుంది" అని తెలివిగా ప్రశ్నించారు. దానితో సభలో మళ్ళీ గందరగోళం మొదలయింది. ఏం చెయాలో తెలియక అందరూ తలలు పట్టుకున్నారు.

మళ్ళీ అదే గొప్ప కుల నేత ప్రసంగించడం మొదలుపెట్టారు "ఇలాంటప్పుడే మనం మన పూర్వీకులని అనుసరించాలి.పూర్వం మనుషుల వేషధారణని బట్టి వాళ్ళ కులాన్ని గుర్తించే వీలుండేది.ఇప్పటికీ కొంతమంది కులస్థులని వాళ్ళ వేషధారణ బట్టి కనుక్కోవచ్చు. ఇప్పుడు అలాంటి పధ్ధతి అన్ని కులాలకీ మొదలుపెడితే బాగుంటుంది." అని నర్మగర్భంగా సెలవిచ్చారు. మిగిలినవారికి కొద్ది కొద్దిగా బోధపడింది.మళ్ళీ ఆయనే కొనసాగించారు. "ఇప్పుడు అది ఎలా చేయాలో చెబుతాను.వినండి.ఇక్కడున్న 20 కులాలు కలిసికట్టుగా చేస్తున్న ఈ పనికి గుర్తుగా మనమందరం వరసలో నిల్చోని ఒకరి చేతులు మరొకరు పట్టుకొని పైకి ఎత్తుదాం.

అన్ని కులాలు ఒక వరుసక్రమంలో నిల్చోవాలి. ఇదే బొమ్మని పచ్చబొట్టుగా మగాళ్ళు కుడి మెడ మీద, ఆడాళ్ళు ఎడమ మెడ మీద వేసుకొవాలి. కాకపోతే ఆ పచ్చబొట్టు వాళ్ళ కులం హైలైట్ అయేలా ఉండాలి. ఉదాహరణకు నేను ఆ వరసలో 3 వాడిగా ఉన్నాననుకోండి. మా కులస్థులందరూ పచ్చబొట్టులో మూడో వ్యక్తి బొమ్మ హైలైట్ అయేలా వేసుకోవాలి." అని పరిష్కారించారు. సభ మొత్తం కరతాళధ్వనులతో మోగిపోయింది.

ఆయన అమోఘమైన తెలివితేటలను అందరూ మెచ్చుకొని సన్మానం చేశారు. ఈ కొత్త వ్యవస్థను స్రుష్టించిన ఆయన గుర్తుగా దీన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనే మొదలుపెడదామని తీర్మానించారు. ముందుగా ఆయన 10 ఏళ్ళ మనవడు రాముని పట్టుకొని పచ్చబొట్టు పొడవడం మొదలుపెట్టారు. నొప్పి తట్టుకోలేక బాధతో రాము వద్దూ...వద్దూ...అంటూ అరుస్తూ ఉలిక్కిపడి లేచాడు.

ఇదంతా పీడకల అని గ్రహించి భయంతో దేవుడి గదికి పరిగెత్తాడు. చాలాసేపు మొక్కొని మెళ్ళగా తలెత్తి చూశాడు. అప్రయత్నంగా ఎదుట ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోలో పచ్చబొట్టు ఎక్కడుందా అని పరికించి చూసాడు. స్వామి నల్లగా ఉండటం వల్ల కనపడలేదేమో అనుకొని వినాయకుడిలో వెదకడం మొదలుపెట్టాడు.

...ఇతిః ఏకత్వంలో భిన్నత్వం...భిన్నత్వం కొరకు ఏకత్వం...--------------సమాప్తం--------------

©jaabilamma

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి