"కులం"కషం - KualmKasham

"కులం"కషం - KualmKasham

"కులం"కషం - KualmKasham

అఖిల కులసంఘ సమావేశం జరుగుతోంది...

ఒక అగ్ర కుల నేత ప్రసంగం మొదలుపెట్టారు "సభికులారా...ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే...మన సమస్యలు, అవసరాలని...మనమే కలిసికట్టుగా పరిష్కరించుకోవాలి...మనందరికీ ఉన్న అత్యంత ముఖ్యమైన నిత్యావసరం ఏంటంటే...

చూసిన వెంటనే ఎదుటోడి కులాన్ని తెలుసుకోవడం...మొన్న నే చూశాం...అన్ని కులాల ప్రజలు సింధు కులం కోసం ఎంత తీవ్రంగా గూగుల్లో వెదికారో...అదే మనకంటూ ఒక సొంత వ్యవస్థ ఉండుంటే అంత కష్టపడాలసి వచ్చేదా? కాబట్టి మనమందరం కలిసి ప్రతి మనిషి కులాన్ని చూపే ఒక సొంత అప్లికేషన్ ని డెవెలప్ చేసుకుంటే మంచిదనీ...అందుకు ఎంత ఖర్చయినా మా వంతు భరించుకోగలమనీ...మా కులస్థులందరి తరపున సగర్వంగా తెలియజేస్తున్నా...సెలవు...జై మా XXX కులం" అని ముగించారు.

ఇంకొక అగ్ర కుల నేత లేచి "మేము సోదరులు చెప్పిన దానితో ఏకీభవిస్తున్నాం. ఇది మన తెలుగు జాతికి ఎంతో అవసరం. మనందరం తక్షణమే స్పందించకపోతే తెలుగు ప్రజలు తీవ్రంగా నష్టపోతారు...మన ప్రభుత్వం వారు చేబట్టిన సర్వే లో కుల వివరాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని మన అప్లికేషన్ లో కాల్ చేసి వాడుకుంటే త్వరగా రూపొందించగలం..." అని ప్రసంగిస్తుండగా...

ఇందాక మాట్లాడిన పెద్ద మనిషితో పాటూ ఇంకొక అగ్ర కుల నేత లేచి "ఇప్పుడు అధికారంలో మీ కులం వాళ్ళున్నారు కాబట్టి ఆ సర్వే కి గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు...ఇందుకు మేము అంగీకరించం" అని అడ్డుపడ్డారు. మిగతా అందరూ వాళ్ళకు వంత పాడారు.

అప్పుడు ఒక వెనుకబడ్డ కుల నేత లేచి "అందరం కలిసి సొంత DB తో కొత్త అప్లికేషన్ని బిల్డ్ చేద్దాం" అన్నారు.

అప్పుడు ఒక దళిత నేత లేచి "మా కులస్థులకి డెవెలప్మెంట్ కాకుండా టెస్టింగ్ ఇస్తే ఒప్పుకోము.మాకు ఖచ్చితంగా డెవెలప్మెంట్ ఇవాలి" అని పట్టుబట్టారు.

దానితో సభలో వివాదం మొదలయింది.అందరూ మాకే  డెవెలప్మెంట్ వర్క్ కావాలని అరవడం మొదలుపెట్టారు...(సశేషం)

©jaabilamma

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి