మాటలుండే చోట మౌనం వెక్కిరిస్తుంది - Matalunde chota mounam vekkiristundi

మాటలుండే చోట మౌనం వెక్కిరిస్తుంది

మాటలుండే చోట మౌనం వెక్కిరిస్తుంది

వెంటే ఉంటానని చెప్పి .. వెనుతిరిగి వెళ్ళిపోయింది కావ్య తనతో ఉన్న క్షణాలకి సాక్ష్యాలైన గాలి, వాన కాలాలని రవి.. ఇలా జరుగుతుందని ముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నాడు ! తనకి దొరమైన ప్రేమకోసం రోధిస్తున్నాడు !!

మాటలుండే చోట మౌనం వెక్కిరిస్తుందినవ్వులుండే  చోట దిగులు గంతులేస్తుంది..!! 

ఏమైంది రవి ??

(ఒక్క నిట్టూర్పు నవ్వుతో ..) 

నేను అడగక ముందే నాకెందుకు చెప్పలేదు తాను విడువక ముందే నేనెందుకు ఊహించలేదు 

గాలి 

మధ్యలో చేరి మా మాటలన్నీ విన్నావు మాటల శబ్దం దాచిన అర్ధం కనిపించలేదా ?ప్రతి శ్వాస కోసం గుండెని చేరావు గుండెని చూపే అద్దం అగుపించలేదా ?తను వెలుగుని దాచే నీడని తను చీకటి చిమ్మే వెలుగులా వెళ్తుందని 

అడగక ముందే నాకెందుకు చెప్పలేదు విడువక ముందే నేనెందుకు ఊహించలేదు

వాన 

చినుకు చినుకుతో పలకరించావు పలకరించిన ప్రతిసారి మమ్మల్ని దీవించలేదా ?ఆనందం కోసం అందరిని కనికరించావు మా మధ్య ఆనందం ఉండాలని భావించలేదా ?తను రేపుని దాచిన నిన్న అని తను నిన్నని మాత్రమే మిగిల్చి పోతుందని 

అడగక ముందే నాకెందుకు చెప్పలేదు విడువక ముందే నేనెందుకు ఊహించలేదు

కాలం  

అనుక్షణం మా వెంట నడిచావు మా నడకలు కలిపే ఘడియలు ఊహించలేదా ?మా మధ్య జరిగిన క్షణాలకి సాక్ష్యం నువ్వు నా ప్రేమని నిజం చేసే నిమిషాలు తలచలేదా ?తను వెళ్లిన కాలానికి బహుమతి అని తను వచ్చే భవిష్యత్తు జ్ఞాపకమని 

మీరంతా .. నేను అడగక ముందే నాకెందుకు చెప్పలేదు. తాను విడువక ముందే నేనెందుకు ఊహించలేదు .. ఎందుకు ఊహించలేదు !

©jaabilamma

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి