Premam _ ప్రేమమ్

Premam _ ప్రేమమ్

Premam _ ప్రేమమ్

తెలవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే

నా గుప్పెడు గుండెలో చిరు చప్పుడు నువ్వే

పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే

నీ పేరే పలకడమే పెదవులకలవాటే

వెన్నెలెలా ఉంటుందే నీ పక్కన చోటే

వేకువలా చూస్తుందే ను నడచిన బాటే

ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే

నా మనసే నీదయ్యే వినదే నా మాటే

ఎవరే...

ఎవరే ప్రేమను మాయంది

ఎవరే ఈ హాయికి హృదయము చాలంది !!

****************

ఎవరి నిన్నే నా వైపు నడిపే

నా ఊహల మధురోహల హరివిల్లు నింపే

తియ తీయని నిమిషాలే నీలోనే ఒంపే

నా ఒంటరి కాలాన్ని నీతోనే చెరిపే

ఆ దైవమె నాకు చెప్పింది ఎపుడో

నీ చిన్ని చిరునవ్వు విలువైన వరమంటూ

నా ప్రాణమే నీకు చెబుతుంది ఇపుడు

ను లేక నే లేనని

గది లాంటి మదిలో నది లాంటి నిన్నే

దాచేయాలనుకుంటే అది నా అత్యాశే

అడుగంత దూరం నువు దూరమైనా

నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే ..

ఎవరే...

*********************

వెన్నెలెలా ఉంటుందే నీ పక్కన చోటే

వేకువలా చూస్తుందే ను నడచిన బాటే

ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే

నా మనసే నీదయ్యే వినదే నా మాటే

ఎవరే...

ఎవరే ప్రేమను మాయంది

ఎవరే ఈ హాయికి హృదయము చాలంది !!

-- శ్రీ మణి

©jaabilamma

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి