ఏది చీకటి .. ఏది వెలుతురు - Sri Sri

ఏది చీకటి    ఏది వెలుతురు

ఏది జీవితం ఏది మృత్యువు 

ఏది పుణ్యం ఏది పాపం 

ఏది నరకం ఏది నాకం 

ఏది సత్యం ఏది అసత్యం 

ఏదనిత్యం ఏది నిత్యం 

ఏది కారణమేది ఏది కార్యం 

ఓ మహాత్మా ..  ఓ మహర్షి ఏది తెలుపు ఏది నలుపు 

ఏది గానం ఏది మౌనం 

ఏది నాది ఏది నీది 

ఏది నీతి ఏది నేతి 

నిన్న స్వప్నం నేటి సత్యం 

నేటి ఖేదం రేపు రాగం 

ఒకే కాంతి ఒకే శాంతి 

 ఓ మహర్షి ..  ఓ మహాత్మా