Majnu - prema lekha chupina Prema Katha

మజ్ను - prema lekha chupina Prema Katha

మజ్ను - prema lekha chupina Prema Katha

"ఈ చీరలో చాలా చాలా చాలా బాగున్నావ్ "

"నీకోసమే కట్టుకొని వచ్చా "

"అలాగే నాకోసం ఒకసారి వెనక్కి తిరిగి చూడవా "

"....." (BGM starts)

అలా చూసాక నానియే కాదు ఏ అబ్బాయి అయినా పడిపోతాడు.

ఇలా మన చుట్టూ జరిగిన కొన్ని .. మనతో జరిగిన కొన్ని సన్నివేశాలతో చాలా ఆహ్లదం గా సాగిపోయే ప్రేమ కథ మజ్ను.

కాలేజీ ప్రేమ కథలు వచ్చి చాలా రోజులైంది.. ఆ లోటు నింపుతూ మనకి ఆనందం పంచుతూ ఎక్కడ నిరాశ పరచని అచ్చ తెలుగు మాటల భీమవరం కథ.

నాని:

ఎంత చెప్పిన తక్కువే.. అంత ఎత్తుకు ఎదిగిపోయాడు నాని. కోపం , బాధ, ప్రేమ, హాస్యం ఇలా అన్నిటినీ చాలా సునాయాసంగా చేసాడు.

విరించి వర్మ:

డైరెక్టర్, తన రాసుకున్న మంచి కథ, ఆ కథకు న్యాయం చేసే నటుల్ని ఎంపిక చేసి... ఎక్కడ బోర్ కొట్టకుండా నడిపించిన తీరు అద్భుతం.

అనంత శ్రీరామ్:

ఈయన రాసిన ప్రేమలేఖతోనే ఈ కథ నడుస్తుంది... అందమైన పదాలతో అచ్ఛమైన తెలుగు ప్రేమలేఖని అందించారు.

చివరగా

ప్రేమకథలెప్పుడు అందమైనవే... అందులో బాధ ఉన్న పగలు.. కోపాలు తక్కువే. అలాంటి అందమైన ప్రేమకథే "మజ్ను"

©jaabilamma

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి