పాటల్లో జొన్నవిత్తుల రామాయణంసీతా రామ చరితం .. శ్రీ సీతా రామ చరితం
గానం  జన్మ సఫలం .. శ్రవణం పాప హరణం 
ప్రతి పద పదమున శృతి  లయాన్వితం 
చతుర్వేద వినితం.. లోక విదితం 
ఆదికవి వాల్మీకి రచితం..  సీతా రామ చరితం

కోదండపాణి ఆ దండకారుణ్యమున కొలువుండే భార్యతో నిండుగా 
అండ దండగ తమ్ముడుండగా, అడవి తల్లికి కనుల పండుగ 
సుందర రాముని మోహించె, రావణ సోదరి సూర్పణక 
సుద్దులు తెలిపి పొమ్మనినా హద్దులు మీరు పైబడగా 
తప్పని సరిఐ లక్ష్మణుడే ముక్కు చెవులు కోసే 
అన్న చూడని  అక్కసు కక్కుచు రావణు చేరే రక్కసి.. 

దారుణముగా మాయ చేసే రావణుడు 
మాయలేడి అయినాడు మారీచుడు 
సీత కొరకు దాని వెనుక పరిగెడె శ్రీ రాముడు 
అదను చూసి సీతని అపహరించే రావణుడు 
కడలి నడుమ లంకలోన కలికి సీతనుంచే 
కరకు గుండె రాకాసులను కాపలాగానుంచే 

శోక జలధి తానైనది వైదేహి 
ఆ శోక జలధిలో మునిగే దాశరధి 
సీతా సీతా
సీతా సీతా..  అని సీతకి వినిపించేలా 
రోదశి కంపించేలా 
రోదించే సీతాపతి ! 

రాముని మోమున దీనతని చూసి వెక్కి ఏడ్చినవి వేదములే 
సీతకెందుకీ  విషాదం 
రామునికేల వియోగం 
కమల నయనములు మునిగే పొంగే కన్నీటిలో 
చూడలేక సూర్యుడే దూకెను మున్నేటిలో
చూడలేక సూర్యుడే దూకెను మున్నేటిలో

వానర రాజగు సుగ్రీవునితో రాముని కలిపే మారుతీ 
జలధిని దాటి లంకను చేరగ కనపడెనక్కడ జానకి 
రాముని ఉంగరం అమ్మకు ఇచ్చి 
రాముని మాటల ఓదార్చి 
లంకను కాల్చి .. లయమున వచ్చి 
సీత శిరోమణి రామునికిచ్చి 
చూసిందంతా చేసినదంతా తెలిపే పూసగుచ్చి ! 


వాయువేగమున వానర సైన్యము కడలికి వారధి కట్టెరా 
బాణ వేగమున రామభద్రుడా రావణ తల పడగొట్టెరా 
ముదమున చేరేని కులసతి సీతని దూరముగా నిలబెట్టెరా 


అంత బాధపడి సీత కోసమని ఇంత చేసే శ్రీ రాముడు 
చెంతచేర జగమంతా చూడగా విత్త పరీక్ష విధించెను 
ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష 
ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష 
శ్రీముని భార్యకా శీల పరీక్ష 
వయోనిజకి అవినీజకా అగ్ని పరీక్ష ?
దశరధుని కోడలికా ధర్మ పరీక్ష ?
జనకుని కూతురికా అనుమాన పరీక్ష? 
రాముని ప్రాణానికా ? .. జానకి దేహానికా ?
సూర్యుని వంశానికా?.. ఈలోకం నోటికా ?? 
ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష .. శ్రీ రామ !


అగ్గిలోకి దూకే అవమానుముతో సతి 
అగ్గిలోకి దూకే అవమానుముతో సతి 
నిగ్గు తేలి సిగ్గు పడే సందేహపు జగతి 
అగ్నిహోత్రుడే పలికే దిక్కులు మార్మోగగా 
సీత మహా పతివ్రతని జగమే ప్రణవిల్లగా 

లోకులందరికి సీత పునీతని చాటే నేటి శ్రీ రాముడు 
ఆ జానకితో అయోధ్య కేగె సకల ధర్మ సందీపుడు 
సీతా సమేత శ్రీరాముడు 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి