తెలుగు ప్రేమలేఖనిత్యం నిర్వచనీయ , నిర్దిష్ట  నేత్రుత్వపు ఆలోచనలు మదిలో నిరంతరం చలిస్తూ , నన్ను  చలింపజేస్తూ
కార్యనిమగ్నడని  గావించగా....

కోటి ఇంద్ర ధనస్సుల వర్ణ రంజితమై , సూది మొన సైతం అవమానింపబడే పదునైన చూపుతో నన్ను చూసినప్పుడు భరింపజాలని భారమైన అవిరామాలోచనలు క్షణికాలంలో ద్రవింపబడి అంతర్దానమైనవి.

ఇట్టి అసంకల్పితమైన, అసందర్భపు , అనాలోచిత, అనిర్వచనీయమైన పరిస్థితిని నా మదిలో నెలకొల్పిన
ఆ చూపుకు ...

ఆ చూపు వెనుకనున్న కన్నులకు..
ఆ కన్నులను దాల్చిన మృదులాస్థిక మోముకు ..
ఆ మోముని ధరింపజేసిన వర్ణరంజిత శరీరమునకు..
ఆ శరీరమును జనింపజేసిన పూజ్యులైన ఆద్యులకు..
నా శత సహస్ర కోటి నందన  వందనములు ..

అటుపిమ్మట జరిగిన పరిణామములు వర్ణించినా అది ఒక  స్కన్ధములతో  కూడిన మహా గ్రంధమే అవుతుంది.
అంతా వర్నింపకున్ననూ ... కొన్ని  తెలుపుటకు అంగీకారమందినదని భావిస్తూ ...

బాధకి , సంతోషానికి  మాధ్యమికంగా మరియు ఇతమిద్ధంగా,  భావవర్ణణకి దూరంగా మరియు అనుభావసారానికి అతి చేరువలో జనించు భావంతరాళంలోకి పడదోసినట్లుగా ఉన్నది.
అట్టి పరిస్థితి నుండి విడుదల పొందుటకు కడు సాహసోపేత చర్యవలె, అతి క్లిష్టమైన కార్యమువలె గోచరించుచున్నది.

ఇక ఊహలు , సంకెళ్ళు తెంచుకున్న ఖైదీల వలె , పంజరము విడిచిన పావురాయి వలె , స్వేఛ్చా వాయువులతో ఊపిరినొసంగి హద్దులు దాటి విహరించుచున్నవి. ప్రతి వర్ణ, ప్రాణ, రూప సహిత-రహిత పదార్ధములందు నీ దివ్య రూపమును దర్శింపబడుచున్నది.

ఇట్టి సైతం వర్ణించిననూ న్యాయము అగుపించక, ఈ విపత్కర, అర్ధసంకోచిత, అర్ధాంత స్థితిగతులకు సాక్ష్యములను జనింపజేయక కడు సొచనీయ స్థాయికి చేర్చిన పరిస్థితిని ఏమందురు ????
వర్ణనాతీతమైన  ఈ భావనకు భాషాజ్ఞానము సైతం ఓటమి కోరలకు బలి  కానున్నదా ???

వర్ణింప కార్యము సంగతి దేవుడెరుగు.

ఇంతటి బృహత్కర, భరింపజాలని స్థితి నుండి విముక్తి కోరుకుంటున్నాను. అందుకు పరిష్కార మార్గము కోసం ప్రయత్నించినచొ శూన్యము గోచరించుచున్నది.
కనుక కరుణతో, కారణంతో , నిరణంతో పరిష్కారమార్గమునొసంగి మమ్ములను భావ తప్త హృదయ విముక్తులను గావించ ప్రార్ధన.
                                                                                     
                                                                                                                                                 ఇట్లు
                                                                                                                                     బాధితోత్తముడు 
వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి