Rush - ఈ సినిమా చూసారా ?


ఆగష్టు 1 1976, నిర్బర్గ్రింగ్ , జర్మనీ. రేస్ మొదలయ్యే ముందు.. 

నిక్కీ, పోటీలోని డ్రైవర్స్ అందరిని పిలిపించి మీటింగ్ పెట్టాడు. "184 వంపులు, మలుపులు కలిగిన ఈ భయంకరమైన రేస్ ట్రాక్ మీద వర్షం పడే సూచన ఉంది. కాదని పోటీకి దిగితే ప్రాణానికే ప్రమాదం,కనుక ఈ పోటీ రద్దు చేయడానికి ఎవరెవరు నాతో మద్దతు ఓటు వెయ్యగలరో " అని అందరికి వివరణ ఇచ్చాడు. 

ఇంతలోనే ఈ రేస్ రద్దు చేయాలా అని నిరుత్సాహపూర్వకంగా మొహాలు, హుంకరింపులు తనకి కనపడ్డాయి .. వినపడ్డాయి. 
డ్రైవర్ లో ఒకరు "మరి రేస్ ఫీజు "
నిక్కీ "ఫీజు లేకపోయినా పర్లేదు.. కానీ ప్రాణాలు కావాలి కదా !"
జేమ్స్ "అంటే ఈ రేస్ రద్దు అయితే ప్రపంచ ఛాంపియన్ గా నువ్వు చెలామణి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది.. "
నిక్కి "అంటే "
జేమ్స్ "నేను కానీ వేరే వాళ్ళు ఎవరైనా కానీ .. నిన్ను గెలిచే మరో అవకాశం కోల్పోయే ఆలోచన నీకు ఉండొచ్చు"
డ్రైవర్ లో ఒకరు "జేమ్స్ నిజం చెప్పాడు.. తప్పించుకోడానికి ఇదొక సాకు .. " అందరు ముక్త కంఠంతో  అవును అవును అని అరవసాగారు. 
ఇంతలో మరో డ్రైవర్ "నిక్కీ భయ పడుతున్నాడేమో "
నిక్కీ "ఎవడా ఎదవ అన్నది ?? " అని కోపంతో గొంతు పెంచాడు. 

ఒక్క క్షణం హాల్ అంతా నిశ్శబ్దం నాటుకుంది.. బయట ఉరుముల చప్పుళ్ళు మాత్రమే విసిగిస్తున్నాయి.. 

నిక్కి "అవును, నేను భయపడుతున్నాను, నాతో పాటు భయం మీకు కూడా.. ప్రతి రేస్ లో 20% నాలో భయం ఉంటుంది ఏ క్షణమైనా చనిపోవచ్చు అని .. దానితోనే  నేను బ్రతుకుతున్నా.. కానీ ఈరోజు రిస్క్ చాలా ఎక్కువ .. ఇంత వర్షం లో "
జేమ్స్ "వర్షం ఉన్నంత మాత్రాన ఏంటి ? వర్షం లో కూడా ఎంత బాగా డ్రైవ్ చేయడంలోనే కదా నీ సామర్ధ్యం ఉంటుంది "
నిక్కి "నా ట్రాక్ రికార్డు చూడు.. ఇక్కడున్న వాళ్లలో నేను ఒక్కడిని మాత్రమే ట్రాక్ ని 7 నిమిషాల లోపే పూర్తి చేయగలిగేది.. కనుక అది నిరూపించుకోవడానికి ఈరోజు మంచి అవకాశం"
జేమ్స్ "అయితే అది నిరూపించితే మరీ మంచిది .. "

అందరూ జేమ్స్ మద్దతుగా రేస్ నిర్వహించాలి అని అరిచారు.. 
కొన్ని క్షణాలు నిక్కీ నిశ్శబ్దంగా ఉండిపోయి జేమ్స్ వైపు కోపంగా చూసాడు.. జేమ్స్ కూడా రేస్ కు సిద్ధమే అన్నట్టు చిరునవ్వుతో నిక్కీ వైపు చూసాడు. చేసేది లేక నిక్కి కూర్చుండిపోయాడు. 

ఇంతలో రేస్ కమిటీ గట్టిగా "రేస్ రద్దుకు ఎవరు మద్దతు ఇస్తున్నారు ?" అని ప్రకటించారు
నిక్కీ తో పాటు మరో కొంతమంది చేతులు ఎత్తారు. 
మరోసారి కమిటీ "రేస్ పెట్టాలని ఎవరు మద్దతు ఇస్తున్నారు ?"
దాదాపు 70% అందరూ చేతులు ఎత్తారు.. 


కొన్ని గంటలలో రేస్ మొదలవుతుంది అని కమిటీ ప్రకటిచింది. అందరూ చప్పట్లు కొడుతూ బయటికి వెళ్లారు.. కానీ నిక్కి అక్కడే కూర్చుండిపోయాడు. 
జేమ్స్ , నిక్కి దగ్గరికి వచ్చి "అప్పుడప్పుడు .. జనం మన మీద చూపించే ఇష్టమే మనకి సహాయపడుతుంది" అని చెప్పి వెళ్ళిపోయాడు. 

నిక్కి తను ఎం మిస్ చేసుకున్నాడో అర్ధం అయిందన్నట్టుగా  చిరునవ్వు నవ్వాడు. 


రేస్ మొదలవుతుంది .. బయటి ఉరుముల చప్పుడు కన్నా రేస్ ఇంజను శబ్దం ఇంకా భయపెడుతుంది. జేమ్స్ ఆకాశం వైపు చూసాడు.. నల్లని మేఘాలు అపశకునంలా దాపురించాయి. 
నిక్కీ కార్ ఇంజిన్ ని స్టార్ట్ చేసాడు.. రేడియో మరియు టీవీ కామెంటేటర్ ల హడావిడి మొదలైంది.. జనం ఉత్సహం ఉత్కంఠ తో రేస్ ని చూస్తున్నారు. 

రేస్ మొదలైంది... ఫార్ములా వన్ కార్లు అన్ని ఒక్కసారిగా ట్రాక్ రోడ్ మీదకి గాలిని చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. జనం లో కేరింత మొదలైంది. 

నిక్కి మరియు జేమ్స్ ఒకే వేగంతో ట్రాక్ పక్క పక్కనే దూసుకుపోతున్నారు. జేమ్స్ అందరిని వెనక్కి నెట్టి ముందుకు వెళ్ళిపోయాడు. మొదటి లాప్ పూర్తి అయింది, జేమ్స్ టైర్స్ మార్చాలని రిపేర్ సిబ్బంది  వైపు వచ్చాడు.. అతడిని వెనుకే నిక్కీ కూడా ..! జేమ్స్ పని పూర్తి చేసుకొని ట్రాక్ మీదకి వెళ్ళాడు. 

అది చూసిన నిక్కీ త్వరగా చేయండి అని అరిచాడు.. నిక్కి టైర్స్ ని పూర్తిగా మార్చ నివ్వలేదు.. వెంటనే కార్ ని పరుగెత్తించడానికి ప్రయత్నించాడు, ఇంతలో వేరే కార్ తన దారికి అడ్డం వచ్చింది.. నిక్కి అడ్డం తీయమని అరిచాడు.. ఇది జరగడానికి మొత్తం 10 సెకన్ల సమయం మాత్రమే.. ఇంతలోనే జేమ్స్ ట్రాక్ మీద అదృశ్యమయ్యాడు. నిక్కి కార్ ని పరుగులు పెట్టించాడు . ఎన్ని మలుపులు.. వంపులు వచ్చినా నిక్కి కార్ వేగం తగ్గించలేదు.. వర్షపు చినుకులు మొదలు అయ్యాయి. 

నిక్కి కార్ సస్పెన్షన్ స్ప్రింగ్ తెగింది, కార్ వెనుక చక్రం రోడ్ మీద జారింది.. కార్ ట్రాక్ తప్పి పక్కనున్న ఫెన్సింగ్ ని ఢీ కొని  బొంగరం లా తిరిగి ట్రాక్ మీదకి వచ్చి ఆగింది.. , నిక్కి ఎం జరిగుంతుందో అర్ధం కాలేదు.. రేస్ లో ఉన్న మరో కార్ నిక్కీ కార్ ఢీ కొట్టింది. రెప్ప పాటు వ్యవధిలో కార్ మీదకు మంటలు అంటుకున్నాయి. నిక్కి సేఫ్టీ బెల్ట్ ఇరుక్కుపోయింది...  మంటలు నిక్కిని వ్యాపించాయి. నిక్కీ బాధతో అరవడం మొదలు పెట్టాడు. ఇంతలో మరో ఇద్దరు డ్రైవర్లు రేస్ నిలిపి విఫల యత్నం చేసారు. నిక్కీ శరీరం మంటల్లో చిక్కుకుంది. 
రెండు క్షణాల్లో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని ఆర్పేశారు... నిక్కీ ని ఆసుపత్రికి తీసుకెళ్లారు 


కొన్ని నెలల తర్వాత.. జేమ్స్ హంట్ నెంబర్ వన్ రేసర్ గా ఎదిగిన రోజులవి.. 


ఒకరోజు జేమ్స్ హంట్ తను రేస్ లో ప్లగిన్ ముందు నిక్కి రేస్ కి వచ్చాడని తన దగ్గర ఎవరో చెప్పారు. జేమ్స్ తనని చూడాలని కుతూహలంతో నిక్కీ వద్దకి వచ్చాడు.. నిక్కి రేస్ టేబుల్ మీద ఉన్న రేస్ పేపర్స్ చూస్తూ అటువైపు తిరిగి నిలబడి ఉన్నాడు. 

జేమ్స్ "నిక్కి "
నిక్కి వెనక్కి తిరిగి చూసాడు.. 
తన మొహం చూసి జేమ్స్ మోహంలో ఎదో తెలియని భయం.. జుగుప్స .. కనపడింది. నిక్కీ మొహం 60% కాలిపోయి.. చాలా అంద విహీనంగా ఉంది. 
నిక్కి "భయ పడ్డావా జేమ్స్"
జేమ్స్ "నిక్కీ.. నేను నిన్ను చూడటానికి హాస్పిటల్ కి వద్దాం అనుకున్న "
నిక్కీ "కానీ రాలేదు"
జేమ్స్ "తప్పు చేసానేమో అనిపించి .. ఆరోజు "
నిక్కీ "దానికి పూర్తి బాధ్యత నీదే "
జేమ్స్ "దానికి నేను ఒప్పుకుంటా"
నిక్కీ "నువ్వు ఛాంపియన్ గా ఎదుగుతున్న రోజుల్లో నేను చావు నుండి పోరాడుతున్నాను.... నాకు ఏ ట్రాక్ మీద నుండి  ఈ పరిస్థితి రావడానికి నీ బాధత్యతో ఎంత ఉందొ  .. . నన్ను తిరిగి అదే  రేస్ ట్రాక్ మీదకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉంది" అని ముగించి నిక్కీ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 

ఆనాటి నుండి నిక్కీ, జేమ్స్ ల మధ్య కనపడని వైరం వెంటాడుతూనే ఉంది. 

70 వ దశకం లో జరిగిన Jemes Hunt, Nickie Lauda మధ్య జరిగిన చారిత్రాత్మక పోరుని ఈ సినిమాలో అత్యద్భుతంగా చూపించారు. జేమ్స్ గా నటించిన క్రిస్ హెంస్వర్త్ మరియు నిక్కీ గా నటించిన డేనియల్ లకు మంచి పేరు తీసుకు వచ్చింది. పీటర్ మోర్గాన్ రచన చాలా బాగుంటుంది. సినిమా చివరిలో వచ్చే జేమ్స్ మరియు నిక్కీ ల మధ్య సంభాషణ మనసుని తాకుతుంది. 

ఫాంటసి నుండి కాక రియల్ లైఫ్ కధలు కోరుకునే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. ఈ సెలవల్లో కుదిరితే తప్పక చూడండి.. ! 


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి