The Age of Adaline - ఈ సినిమా చూసారా ?అనుకోని అద్భుతాలు కొన్ని జీవితాల్లోనే  జరుగుతాయి.. అలాంటి ఒక అద్భుతం Adaline Bowman అనే యువతీ జీవితంలో కూడా జరిగింది. 

1908 జనవరి 1వ తేదీన ఆడలిన్, శాన్ఫ్రాన్సికో లో జన్మించింది. యుక్త వయసుకి రాగానే,  అప్పట్లో గోల్డెన్ గేట్ బ్రిడ్జి నిర్మాణంలో ఉన్న ఒక ఇంజనీర్ ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. 

తాను ఒక బిడ్డకి జన్మనిచ్చింది. ఇదంతా మాములుగా అందరి జీవితంలో జరిగే విషయాలే కదా అనుకునే సమయంలో, తన భర్త బ్రిడ్జి ప్రమాదంలో మరణిస్తాడు. భరించలేని బాధతో కృంగిపోతుంది. ఆ బాధ నుండి బయటపడే ప్రయత్నంగా, చిన్న ఉద్యోగంలో  చేరుతుంది. 

1935 ఒకనాడు, తన కారులో ఇంటికి బయలుదేరుతుండగా, ఎప్పుడు రాలేని మంచు కొత్తగా కురవడం మొదలు పెడుతుంది. వేగంగా వెళ్తున్న కారు, రోడ్ మీద మంచు వలన జారీ, పక్కనే చిన్న లోయలో పడుతుంది, రెండు అడుగులు లోతున్న నీటిలో కార్ తో సహా పడిపోతుంది. 

ఎం జరిగిందో తెలిసేలోపే.. చల్లని నీటికి తన శరీరం మొద్దుబారుతుంది, గుండె వేగం నెమ్మదిస్తుంది. ఊపిరి పీల్చే ఆలోచనలే తనకు లేదు, మరుక్షణంలో మరణిస్తుంది. 
కానీ ఇక్కడే దేవుడు ఉన్నడా అని అనిపిస్తుంది. అకస్మాత్తుగా 66 లక్షల వోల్టుల సామర్ధ్యం ఉన్న పెద్ద పిడుగు లోయలో ఉన్న కార్ ని తాకింది. కార్ నుండి  విద్యుత్ శక్తి కొద్దిగా సామర్ధ్యం తగ్గి ఆడలిన్ శరీరాన్ని తాకుతుంది., తనకు తెలియకుండానే గుండె స్పందించడం మొదలు పెట్టింది, మరో రెండు నిమిషాల్లో తన ఊపిరి తీసుకోవడానికి నీళ్ళనుండి పైకి లేస్తుంది. 


ఆ ప్రమాదం తరువాత తను జీవితంలో ఒక అద్భుతాన్ని గమనిస్తుంది, ఎన్నేళ్లు గడిచిన ఎప్పటిలా యవ్వనంగా ఉంటుంది. ఎవరూ నమ్మలేని అద్భుతం జరిగేలోపే, ఈ వరం వలన మరో శాపం ఎదురవుతుంది. 


ఒకనాడు పోలీస్ లకు తన యవ్వన రహస్యం పైన అనుమానం వస్తుంది. 40 ఏళ్ళు గడిచినా తన ఫోటో ఐడెంటిటీ లో మార్పు రాలేదని విచారణ పేరుతో ఆడలిన్ ని తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తారు  , వారి నుండి ఆడలిన్ బయటపడి శాన్ఫ్రాన్సికో ని వదిలి వేరే నగరానికి చేరుకుంటుంది. అక్కడ ఒక యూనివర్సిటీ గ్రంధాలయం లో పనిచేస్తూ తనకు జరిగిన ఈ మార్పు గురించి ఎన్ని పుస్తకాలు చదువుతుంది. ఈ మార్పు గురించి ఏ పుస్తకంలోను లేదని నిరుత్సాహ పడి కొన్నాళ్ళకు వెనుతిరిగి శాన్ఫ్రాన్సికో చేరి, అక్కడ మరో మరో గ్రంధాయలంలో ఉద్యోగిని గా చేరుతుంది. ప్రతి పదేళ్లకు తన పేరు, వయసు రహస్యం గా మార్చుకుంటూ 106 ఏళ్ళు గడుపుతుంది. 


2014 December 31 రాత్రి, ఆడలిన్ కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఒక పార్టీ కి వెళుతుంది. అక్కడ Elles Jones అనే యువకుడిని కలుస్తుంది. వయసులో ఎంతో చిన్నవాడైనా, ఆడలిన్ మాత్రం ఆకట్టుకుంటాడు. మాట మాట కలసి పరిచయం స్నేహం గా మారుతుంది. జోన్స్, ఆడలిన్ మీద అపారమైన ప్రేమని పెంచుకుంటాడు. తన ప్రేమని పెద్దలకి పరిచయం చేయాలని జోన్స్ తన ఇంటికి తీసుకెళ్తాడు.  


అక్కడ జోన్స్ తండ్రి విలియం, ఆడలిన్ ని గుర్తు పడతాడు..

అసలు ఆడలిన్ ని విలియం ఎందుకు , ఎలా గుర్తు  పడతాడు, వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి.. ఆడలిన్ ఇంకా అలాగే ఉండిపోయిందా,  తరువాత ఎం జరిగిందో తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే !

అండలిన్ పాత్రలో బ్లేక్ లైవ్లీ అత్యద్భుతంగా ఒదిగిపోయింది, ఆడలిన్ అనే యువతీ ఇలాగే మన ముందు ఉంటుందా అనిపించేలా జీవించింది. అతిధి పాత్రలో హుర్రిసన్ ఫోర్డ్ కూడా మెప్పించాడు. ఎంచుకున్న కథ అంశం ఎంతో విచిత్రంగా ఉన్నా, కధనం తో కట్టి పడేయగల దర్శకుడు లీ మరియు రచయితలు మిల్స్, సాల్వడార్ ప్రతిభ ను మెచ్చుకోవలసిందే !1 వ్యాఖ్య:

  1. చాలా అధ్బుతంగా రాశారు! ఆ సినిమా ఖచ్చితంగా చూడాలి అనిపించేలా మీ రివ్యూ! గొప్ప రచయితలు మీరు!

    ప్రత్యుత్తరంతొలగించు