ఈ సినిమా చూసారా ? - Detectiveచాలా కాలం తర్వాత మంచి డిటెక్టివ్ థ్రిల్లర్ వచ్చింది, అసలు డిటెక్టివ్ మూవీస్ చూసి చాలా రోజులైంది కదా ! అందులో ఈరోజుల్లో మంచిది అంటే కష్టమే (3 ఫైట్లు 6  కమర్షియల్ సినిమా కాకుండా  అని నా ఉద్దేశం!)

ఈ సినిమా గురించి చెప్పాలంటే అన్ని కొత్త విషయాలే .. ఒక నవల చదివినప్పుడు కలిగే థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ ఒక  పెట్టడం అంటే మాములు గొప్ప విషయం కాదు. డిటెక్టివ్ సినిమా అంటే మనం కూడా బుర్ర పెట్టి ఆలోచించాలి అన్న ఆలోచన రావొచ్చు .. కానీ ఈ సినిమాకు కష్ట పడాల్సిన పనిలేకుండా డైరెక్టర్ చాలా బాగా screenplay రాసుకున్నారు. ప్రతి చిన్న విషయం ప్రశ్నలా మిగిలిపోకుండా దాని వెంటనే ఒక చిన్న సన్నివేశంతో సమాధాన పరుస్తూ కధలో అంతర్లీనంగా వెళ్తూ ఉంటుంది.. ఇది ఒక కొత్త విషయమే మరి. ఇలాంటివి బోలెడు 


కథ: కథ విషయానికి వస్తే.. చిన్న తీగ లాగితే డొంకంతా కదిలింది అన్న అంశాన్ని అద్భుతంగా చూపించారు. (కథ ఇక్కడితో ఆపేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా )విశాల్: డిటెక్టివ్ అంటే కాన్ఫిడెంట్ ముఖ్యం . దానికి తగ్గట్టుగా సూపర్ కాన్ఫిడెంట్ పాత్రలో ఒదిగిపోయాడు. తనతో పాటు మనల్ని డిటెక్టివ్ మూడ్ లోకి తీసుకువెళ్తాడు. తను చేసే పనులకి అర్ధం చూపిస్తూ అంతే ఇంటెలిజెంట్ గా మనలని ఆలోచింపచేస్తాడు. సినిమా మొత్తం తనే డ్రైవ్ చేస్తూ అద్భుతంగా నటించాడు . ముఖ్యంగా kungfu ఫైట్ ఒక సర్ప్రైజ్
వినయ్ : డిటెక్టివ్ సినిమా అంటే ప్రతి చిన్న విషయం గమనించాలి.. అలా గమనింపదగిన  విషయాలన్నీ తుడిచేస్తూ .. వాటి ఆనవాళ్ళని మార్చేస్తూ తన మేధా శక్తికి సవాళ్ళను విసిరేవాడే విలన్. ఇంటెలిజెంట్ గా ఉంటూ, అంతే రీతిలో ఎంతో క్రూరంగా తన పనులను చేసుకుంటూ పోతాడు విలన్. వినయ్ దీనికి తగ్గట్టుగా పాత్రకి సరైన న్యాయం చేసాడు. 


భాగ్యారాజ్: నటుడు భాగ్యరాజ్ ఈ సినిమాలో ఒక surprise ఎలిమెంట్. బాగా చేసాడు, ఒదిగాడు అని చెప్పడం కంటే చూస్తేనే బెటర్ 

ప్రసన్న, ఆండ్రియా, అను ఎమాన్యూల్ : కథలో జరిగే పాత్రల్లో ఒదిగి పోయారు.


ఫోటోగ్రఫీ : మాములు విషయాన్ని కొత్తగా డిటెక్టివ్ మోడ్ లోకి తీసుకెళ్తుంది, కెమెరాకి లెన్స్ మార్చినట్టు మన కళ్ళకి కొత్త లెన్స్ పెట్టేసినట్టు ఉంటుంది కెమరామెన్  కార్తీక్ వెంకటరామన్ పనితనం. నిజంగానే ఫ్రేమ్స్ చూడగానే నచ్చేస్తాయి , దానికి చిన్న ఉదాహారణ ట్రైలర్లో వచ్చిన ఈ క్రింది షాట్స్. 

సంగీతం: పాటల్లేని సినిమాకి background ప్రాణం, ఇది ఇంకా బాగుంటే బాగుండేది అనిపించింది కానీ Arrol Corelli పనితనం పరవాలేదు.

డైరెక్షన్ : ఈ డిపార్ట్మెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఒక్క పాట లేకుండా ప్రేక్షకుడిని కట్టిపడేయడమే కాకుండా.. రెప్ప ఆర్పితే ఎం జరుగుతుందో ఏం మిస్ అవుతామన్న ఆలోచన కలిగించేలా ఉంటుంది డైరెక్టర్ టాలెంట్. Mysskin deserves true appreciations. డేవిడ్ ఫించేర్ రేంజ్ లో exciting ఎలెమెంట్స్ ఉన్నాయనడంలో సందేహాలు లేవు. 


చూసినప్పుడు చాలా ఉన్నాయి.. కానీ కొన్ని విషయాలు మాత్రమే చెప్పగలను, డబ్బింగ్ సినిమా కదా ఏముంటుంది అరవ గోల తప్ప అని అనుకోవద్దు, ఇది ఏ ప్రాంతానికి చెందదు.  
Truly International Content , just go and watch !! - సినీ ప్రేమికుడు వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి