శ్రీశైల దర్శనం
కాటి కాపరికి నీటి కొలనుతో పని ఏల?
భస్మాంగుడికి బంగారు కప్పులేల?
గంగాధరుడికి నిత్యాభిషేకాలేల?
సర్వాంతర్యామి దర్శనానికి వరుసలో ఎదురు చూడనేల?
వేర్వేరుగా ఉంటున్న అమ్మ వారిని, అయ్య వారిని
చూసి తరించానని అనుకోవడమెలా?
బిచ్చగాడిని అర్థించుటకు కుల సంఘాల పేరుతో కూడిన
ఈ కుళ్ళిన మాంసపు ముద్దలను భక్తులని అనుకోవడమేల? 
వారిని లెక్కించుటకు తోడుగా సాక్షి గణనాథుడేల?
నిగూఢ బహిరంగ రహస్యమగు నిరాకార రూపుడి లీలలను అవగతం చేసుకొన యత్నించనేల?
భావావేశంతో ఇలా నన్ను నేను హింసించుకోనేల?
వరాలుగా ప్రశ్నలను ఇవ్వడమేల శ్రీశైల మల్లేశ్వర?


- రాఘవేంద్ర ప్రసాద్ 

3 వ్యాఖ్యలు: